బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol) వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జాట్ (Jaat)’. ఈ సినిమా ప్రస్తుతం లీగల్ చిక్కుల్లో పడింది. ఈ మూవీలోని ఓ సీన్ ఓ మతానికి సంబంధించిన వారి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆయనతో సహా సినిమాలో నటించిన పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.
మా మనోభావాలు దెబ్బతిన్నాయ్
జాట్ (Jaat Controversy) సినిమాలోని ఓ సన్నివేశం తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని పంజాబ్‌కు చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావాలనే ఇలాంటి సీన్‌ను సినిమాలో పెట్టారని ఆరోపిస్తూ ఆ చిత్రంలో నటించిన వారిపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో జాట్ డైరెక్టర్ గోపీ చంద్ (Director Gopichand), హీరో సన్నీ డియోల్ సహా పలువురు నటీనటులుపై అధికారులు కేసు నమోదు చేశారు.
Our sincere apologies to everyone whose sentiments were hurt.
The objectionable scene has been removed.#JAAT pic.twitter.com/vj8tbKDxoi— Mythri Movie Makers (@MythriOfficial) April 18, 2025
మమ్మల్ని క్షమించండి
అయితే ఈ వివాదంపై తాజాగా మేకర్స్ స్పందించారు. తాము కావాలని ఒక వర్గాన్ని అనుమానించాలని చేయలేదని.. చెబుతూ క్షమాపణలు కోరారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థ (Mythri Movie Makers) ఓ నోట్ విడుదల చేసింది. ‘జాట్ సినిమాలోని ఓ సీన్‌పై నెగెటివ్ రియాక్షన్ వచ్చింది. చాలా విమర్శలు వెల్లువెత్తాయి. తెలియకుండా మా వాళ్ల బాధపడినందుకు మేము చింతిస్తున్నాం. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనేది మా ఉద్దేశం కాదు. ఆ సన్నివేశాన్ని ఇప్పటికే తొలగించాం’ అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.






