NIMS: నిమ్స్ ఆసుపత్రిలో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం

హైదరాబాద్, నిమ్స్(Nizam’s Institute of Medical Sciences) ఆసుపత్రి అత్యవసర విభాగంలో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. అత్యవసర విభాగం(Emergency Department)లోని ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. కిటికీల నుంచి దట్టమైన పొగలు బయటకు రావడంతో ఆసుపత్రిలో ఉన్న వారు అందరూ బయటకు పరుగు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు..

కాగా ఈ ప్రమాదంపై ఆసుపత్రి సూపరింటెండెంట్(NIMS Hospital Superintendent) స్పందించారు. ‘‘నిమ్స్ ఆసుపత్రి ట్రామా బ్లాక్‌లోని ఐదు, ఆరు అంతస్తులో సుమారు 4.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ షార్ట్‌సర్య్కూట్‌తో మంటలు వ్యాపించాయి. తక్షణమే స్పందించిన ఆసుపత్రి రెస్క్యూ సిబ్బంది పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. ప్రస్తుతం అంతా కంట్రోల్‌లోనే ఉంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టాం’’ అని తెలిపారు.

Related Posts

Hyderabad Metro: పెరిగిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలు

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠా ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 17 నుంచి అమలు కానున్నట్లు…

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *