GT vs DC: టాస్ నెగ్గిన టైటాన్స్.. తొలి బ్యాటింగ్ ఎవరిదంటే?

IPL 2025లో భాగంగా ఈ రోజు 35వ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు(GT vs DC) తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ మ్యాచులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నట్లు గిల్ తెలిపాడు. అటు ఢిల్లీ కూడా అదే టీమ్‌తో ఆడుతోంది. కాగా ఐపీఎల్ పాయింట్స్(Points Table) టేబుల్‌లో ఈ రెండు జట్లు నువ్వా-నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం డీసీ తొలి స్థానంలో ఉండగా.. గుజరాత్ మూడో స్థానంలో ఉంది. ఈ రోజు గుజరాత్ గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకుంటుంది.

హెడ్ టు హెడ్ రికార్డ్స్

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్(GT), ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్లు 5 మ్యాచ్‌‌‌లు ఆడాయి. అందులో ఢిల్లీ క్యాపిటల్స్‌దే పైచేయిగా నిలిచింది. గుజరాత్ టైటాన్స్ 2 మ్యాచ్‌లలో విజయం సాధిస్తే, ఢిల్లీ 3 గెలిచింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. నరేంద్రమోదీ స్టేడియంలో ఢిల్లీపై గుజరాత్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం గమనార్హం.

తుది జట్లు ఇవే..

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, KL రాహుల్(w), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(c), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(సి), జోస్ బట్లర్(w), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ

Related Posts

Hyderabad Metro: పెరిగిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలు

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠా ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 17 నుంచి అమలు కానున్నట్లు…

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *