భారత్- పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు(High tension between India and Pakistan) కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. వరుసగా రెండో రోజూ దాడులకు(Attacks) పాల్పడింది. శుక్రవారం రాత్రి జమ్మూ, సాంబా, పఠాన్ కోట్లలో డ్రోన్లతో దాడి(Drone Attacks) చేసింది. కాగా పాక్ డ్రోన్లను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. మరోవైపు జైసల్మేర్, ఉరీ, పంజాబ్, గుజరాత్లలో హైఅలర్ట్(High Alert) ప్రకటించారు. అటు జమ్మూకశ్మీర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్(Blockout) ప్రకటించారు. ఈ మేరకు అధికారులు సైరన్లు(Sirens) మోగించారు. మరోవైపు జమ్మూ వ్యాప్తంగా పూర్తి బ్లాక్ అవుట్ కొనసాగుతోందని సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. నగరం మొత్తం సైరన్ల మోత వినిపించిందని తెలిపారు.
#WATCH | Jammu and Kashmir: Explosions can be heard in Poonch due to shelling from the Pakistani side
(Visuals deferred by an unspecified time) pic.twitter.com/nmHItfTMkC
— ANI (@ANI) May 9, 2025
మే 15 వరకూ ఆ రాష్ట్రాల్లో విమానాలు రద్దు
ఇదిలా ఉండగా భారత పౌర విమానయాన శాఖ(Civil Aviation Authority of India) కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రాల్లోని 24 విమానాశ్రయాలను(Airports) మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మే 15వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుందని పేర్కొనింది. జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్నగర్, రాజ్కోట్లకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. యుద్ధ ప్రభావిత ప్రాంతాలకు విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికుల(passengers)కు పూర్తి నగదును రీఫండ్(Refund) లేదా రీబుకింగ్(Re-Booking)కు అవకాశం కల్పిస్తామని ఎయిర్ లైన్స్ సంస్థలు తెలిపాయి.







