Food Safety License: వీధి వ్యాపారాలకు ఇకపై రిజిస్టేషన్ తప్పనిసరి!

Mana Enadu: ప్రజెంట్ ట్రెండ్ మారింది. చాలా మంది బిజీలైఫ్‌లో ఇంట్లో వంట చేయడమే తగ్గించేశారు. స్విగ్గీనో, జొమాటో(Swiggy, Zomato)లోనో ఆర్డర్ చేయడం, వీలైతే స్ట్రీట్ ఫుడ్(Street food) తీసుకొచ్చి తినడం అలవాటైపోయింది. దీంతో ఆన్లైన్ ఫుడ్ బిజినెస్‌లతోపాటు స్ట్రీట్ ఫుడ్ సెంటర్లూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో గల్లీకో టిఫిన్ సెంటర్‌(Tiffin Centre) ఉంటోంది. కర్రీ పాయింట్‌లు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శుభ్రత పాటించడం కూడా చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్(Telangana Govt) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు సురక్షిత ఆహారాన్ని అందించేందుకు వీధుల్లో ఆహారాన్ని విక్రయించే వ్యాపారులందరినీ ఆహార భద్రతా ప్రమాణాల చట్టం (FSS) పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ చట్టం ప్రకారం స్ట్రీట్‌ ఫుడ్‌ వెండర్స్‌(Street Food Vendors) అందరూ రిజిస్ట్రేషన్‌(Registration) చేయించుకోవడం తప్పనిసరి.

 హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు

ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త చట్టం ప్రకారం వీధుల్లో ఇడ్లీ, పానీపూరి బండితో సహా అన్ని రకాల స్ట్రీట్ ఫుడ్‌ వెండర్స్‌ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. అయితే ముందుగా ప్రయోగాత్మకంగా హైదరాబాద్(HYD) మహానగరంలో దీనిని అమలు చేయనున్నారు. ఆ తర్వాత మిగతా జిల్లాలు, పట్టణాల్లోని వ్యాపారులకు వర్తింపజేస్తారట. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది వీధి వ్యాపారులకు గుర్తింపు దక్కనుంది. అలాగే ఆహార నాణ్యతా మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేల ఈవిధానం అమలైతే దేశంలోనే తొలిసారిగా వీధి ఆహార వ్యాపారులందరికీ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలువనుంది.

 అందుకు ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు

అయితే వ్యాపారులు రిజిస్టేషన్‌ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఆహార భద్రతా విభాగం అధికారులే ఈ స్ట్రీట్ వెండర్స్ వద్దకు వస్తారట. వారి ఆధార్‌ కార్డు ఆధారంగా అప్పటికప్పుడే రిజిస్టేషన్ చేసి సర్టిఫికేట్(Certificate) ఇస్తారు. ఇందుకోసం రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఏటా దీనిని అంతే మొత్తం చెల్లించి రెన్యువల్(Renual) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఇప్పటికే భారత జాతీయ వీధి వ్యాపారుల సంఘం (NASVI) సహకారం, నెస్లే ఇండియా(Nestlé India) స్పాన్సర్‌షిప్‌తో ఇప్పటికే హైదరాబాద్‌లో 3 వేల మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారట. దీంతో వ్యాపారులపై అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు బ్యాంకుల నుంచి లోన్స్(Bank Loans) పొందే అవకాశం కూడా లభిస్తుంది. ఇక GHMC, మున్సిపల్(Municipal), పోలీసు(Police) విభాగాల నుంచి వేధింపులు కూడా ఉండవని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *