మన ఈనాడు ప్రత్యేకం:
ఏపీ మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హౌస్ రిమాండ్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో రూ.వందల కోట్లు కొట్టేశారన్న అభియోగాల మీద బాబు అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే ఆయన్ను విడిపించేందుకు దేశంలోని ప్రముఖ న్యాయవాదులు, పలు పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉన్న నేతకు ప్రాణహానీ ఉందంటూ బాబు తరఫు న్యాయవాది లూథ్రా.. బాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు బదులు ఇంట్లో ఉంచి విచారణ చేసేందుకు వీలు కల్పించాలంటూ ఈ హౌస్ రిమాండ్ పిటిషన్ను దాఖలు చేశారు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకంటే భద్రత ఇంకెక్కడ ఉంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది పొన్నవోలు కోర్టులు వాదించడంతో ఆయన వాదనతో ఏకీభవించిన జడ్జి ఈ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. దీంతో మరి కొన్నాళ్లు చంద్రబాబు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై తెదేపా శ్రేణులు భగ్గుమంటున్నాయి.