JEE Mains: వారెవ్వా.. ఒకే గ్రామంలో 40మందికిపైగా మెయిన్స్‌ ర్యాంకులు

భారత్‌లో నిర్వహించే ప్రవేశ పరీక్షలలో అత్యంత టఫ్ ఎగ్జామ్ జేఈఈ మెయిన్స్(JEE Mains) ఒకటి. చాలా మంది విద్యార్థులు ఇందులో ర్యాంక్ కొట్టి ప్రతిష్టాత్మక NIT, IIT, IIITల్లో సీటు దక్కించుకోవాలని ఉవ్విళూరుతుంటారు. కానీ చాలా మంది కనీసం పాస్ అయ్యేందుకే తీవ్రంగా కష్టపండుతుంటారు. ఎందుకంటే అంత కఠినంగా ఉంటుంది ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్(Entrance Exam). దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్ష ఏడాదికి రెండు సార్లు నిర్వహించినా పాస్ పర్సంటేజీ మాత్రం అంతంత మాత్రమే. దీంతో సాధారణంగా ఒక రాష్ట్రంలో ఇందులో సీటు సంపాదించే వారి సంఖ్య దాదాపు వందలోపే ఉంటుంది. అలాంటిది ఓ మారుమూల గ్రామంలో ఏకంగా 40 మందికిపైగా విద్యార్థులు ఇటీవల వెల్లడైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకుందామా..

28 మంది ఆ కోచింగ్‌ సెంటర్ నుంచే..

ఇటీవల జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు(JEE Mains Results) విడుదలైన సంగతి తెలిసిందే. కనీస కటాఫ్‌ స్కోర్ సాధించిన 2,50,236 మంది విద్యార్థులు.. జేఈఈ అడ్వాన్స్‌డ్(JEE Advanced 2025) పరీక్ష రాయనున్నారు. అయితే దీనికి క్వాలిఫై అయిన వాళ్లలో 40 మందికి పైగా విద్యార్థులు ఒకే గ్రామానికి చెందినవారు కావడం విశేషం. బిహార్‌(Bihar)లోని గయ అనే జిల్లాలో ఐఐటీ విలేజ్‌గా పేరుపొందిన పఠ్వాఠోలీ(Patwatoli) నుంచి వాళ్లందరూ ఉత్తీర్ణత సాధించారు. వీళ్లలో 28 మంది వృక్ష సంస్థాన్‌ కోచింగ్‌ సెంటర్ నుంచి శిక్షణ పొందిన వారు కావడం గమనార్హం.

ఐఐటీ చదవాలనుకునేవాళ్లకి ఫ్రీ కోచింగ్

1991లోనే పఠ్వాఠోలీ(Patwatoli)కి ఐఐటీ వీలేజ్‌గా పేరు పొందడానికి బీజం పడింది. ఈ గ్రామం నుంచి 1991లో మొదటిసారిగా జితేంద్ర పఠ్వా(Jithendra Patwa) అనే అతను ఐఐటీలో సీటు సాధించారు. ఆ తర్వాత జితేంద్ర మంచి ఉద్యోగం సంపాదించారు. US వెళ్లిపోయారు. తనలాగే మిగతావారు కూడా ఎదగాలని Vriksh We The Change అనే పేరుతో ఓ NGOను స్థాపించారు. అప్పటినుంచి ఆ ఊరిలో ప్రతి ఇంట్లో కూడా ఐఐటీ పదం వినిపిస్తోంది. ఒకప్పుడు వస్త్ర పరిశ్రమలు, చేనేత పని చేసుకునేవాళ్లు ఎక్కువగా ఉండే ఈ గ్రామంలో ప్రస్తుతం ఇంజినీర్లకు నిలయంగా మారిపోయింది. 2013లో ప్రారంభమైన వృక్ష సంస్థాన్‌లో ఐఐటీ చదవాలనుకునేవాళ్లకి ఫ్రీగా కోచింగ్ ఇస్తుండటం విశేషం.

Related Posts

JNV: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరోసారి నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తు గడువు పెంపు

విద్యార్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న జవరహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు(Application Deadline)ను అధికారులు మరోసారి పొడిగించారు. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 27వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. 2026- 27…

TG TET: తెలంగాణ టెట్​ రిజల్ట్స్​ వచ్చేశాయ్​..

తెలంగాణ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీ టెట్) (TG TET) రిజల్ట్స్​ వచ్చేశాయి. సచివాలయంలో మంగళవారం ఉదయం 11గంటలకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా రిలీజ్ చేశారు. జూన్ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్లైన్ పరీక్షలు జరిగాయి. మొత్తం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *