ప్రపంచ దేశాల్లో బంగారాన్ని (Gold Price Today) ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారతదేశానిది రెండో స్థానం. మన దేశంలో పసిడి భారీగా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా స్విట్జర్లాండ్, సౌతాఫ్రికా దేశాల నుంచి భారీగా పుత్తడి మనదేశానికి దిగుమతి అవుతుంటుంది. సంక్షోభ పరిస్థితుల్లో ఆదుకుంటుందన్న ఉద్దేశంతో, బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank Of India) ఏటా టన్నుల కొద్ది బంగారం కొనుగోలు చేస్తుంది.
దిగొచ్చిన పసిడి ధరలు
ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇంట్లో ఇతర వేడుకల్లో మహిళలు బంగారు ఆభరణాలు ధరిస్తుంటారు. ఇక ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలో బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి. ఇటీవల పసిడితో పాటు ఇటీవలి కాలంలో వెండికి కూడా గిరాకీ పెరిగింది. మరి మార్కెట్లో ఇవాళ (మార్చి 8వ తేదీ 2025) బంగారం, వెండి ధరలు (Silver Price Today) ఎక్కడ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో బంగారం ధరలు
హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాములపై రూ. 330 తగ్గి రూ. 87,160 వద్ద అమ్ముడుపోతోంది. ఇక 22 క్యారెట్స్ గోల్డ్ రేటు 10 గ్రాములపై రూ. 300 తగ్గడంతో రూ. 79,900 వద్ద పలుకుతోంది. మరోవైపు హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,08,100 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక దేశీయంగా బంగారం ధరలు పడిపోయినా అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ప్రస్తుతం ఫ్లాట్‌గానే కొనసాగుతున్నాయి.






