
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) సందర్భంగా మహిళలను గౌరవిస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అందుకు సంబంధించి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు చేసింది. ఇవాళ సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ సభా వేదికగా.. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 (Indira Mahila Shakti Mission)ను ప్రభుత్వం విడుదల చేయనుంది.
ఇందిరా మహిళా శక్తి మిషన్
ఈ పాలసీ ద్వారా రాష్ట్ర సర్కార్.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని సంకల్పించింది. మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన, సంపద సృష్టి ప్రధాన లక్ష్యాలుగా ఈ పాలసీ రూపొందించింది. ఇందులో సభ్యుల కనీస వయసును 18 నుంచి 15కు, గరిష్ట వయసును 60 ఏళ్ల నుంచి 65కు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు 32 జిల్లాల్లో మహిళా సంఘాలు ఏర్పాటు చేయనున్న 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాట్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వర్చువల్‌గా శ్రీకారం చుట్టనున్నారు.
అద్దె బస్సులకు శ్రీకారం