
బంగారం ధరలు (Gold Price) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి ప్రజలు పసిడి ఆభరణాలు కొనుగోలు చేయాలంటే జంకుతున్నారు. ఇక పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధర ఎక్కువైనా బంగారం కొనుగోలు చేయక తప్పడం లేదు. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న పుత్తడి ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మరి తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దామా..?
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
దేశంలో పసిడి, వెండి ధరలు (Silver Price Today) స్వల్పంగా తగ్గాయి. మంగళవారం రోజున రూ.89,230 ఉన్న 10 గ్రాముల బంగారం ధర బుధవారం నాటికి రూ.570 తగ్గి రూ.88,660కు చేరుకుంది. కిలో వెండి ధర మంగళవారం రోజున రూ.98,838 ఉండగా, బుధవారం నాటికి రూ.1,646 తగ్గి రూ.97,192 వద్ద పలుకుతోంది. మరి తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, ప్రొద్దుటూరు, విశాఖపట్నంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
పసిడి, వెండి ధరలు
- హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర రూ.88,660.. కిలో వెండి ధర రూ.97,192
- విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర రూ.88,660.. కిలో వెండి ధర రూ.97,192
- విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం ధర రూ.88,660.. కిలో వెండి ధర రూ.97,192
- ప్రొద్దుటూరులో 10 గ్రాముల బంగారం ధర రూ.88,660.. కిలో వెండి ధర రూ.97,192గా ఉంది.