
దేశంలో బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకోనుంది. సామాన్యులు పసిడి కొనాలంటే జంకే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇప్పట్లో మధ్యతరగతి వాళ్లు బంగారం కొనడానికి భయపడుతున్నా.. శుభకార్యాలకు కొనక తప్పడం లేదు. ఇక ఇవాళ వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధర
సోమవారం రూ.89,080 ఉన్న 10 గ్రాముల బంగారం ధర.. మంగళవారం నాటికి నాటికి రూ.150 పెరిగి రూ.89,230కు చేరుకుంది. ఇక కిలో వెండి ధర సోమవారం రూ.99,148 ఉండగా, మంగళవారం నాటికి రూ.310 తగ్గి రూ.98,838 వద్ద పలుకుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, ప్రొద్దుటూరు, విశాఖపట్నం, విజయవాడలోనూ పుత్తడి ధరలు రూ.89,000ల దాకా చేరింది. మరి ఈ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దామా..?
బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి
- హైదరాబాద్లో 10 గ్రాముల పసిడి ధర రూ.89,230.. కిలో వెండి ధర రూ.98,838
- విజయవాడలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.89,230.. కిలో వెండి ధర రూ.98,838
- విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం ధర రూ.89,230.. కిలో వెండి ధర రూ.98,838
- ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.89,230.. కిలో వెండి ధర రూ.98,838.