భద్రాచలం(Bhadrachalam)లోని శ్రీ సీతారామచంద్రస్వామి(SithaRamaChandramurthy) ఆలయంలో సోమవారం (ఏప్రిల్ 7) మహాపట్టాభిషేకం(Maha Pattabhishekam) జరగనుంది. ఈమేరకు ఉదయం 4 గంటలకు ఆలయం తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కళ్యాణ మండపంలో అభిషేక మహోత్సవ కార్యక్రమం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. శ్రీరామనవమి తర్వాత రోజు మహాపట్టాభిషేకం చేయటం రామాలయం ప్రత్యేకం. ఈ వేడుకకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) హాజరై సీతారాములకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
రాములోరి కళ్యాణం.. తన్మయత్వంలో భక్తులు
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వార్షిక కళ్యాణోత్సవం అశేష భక్తుల జయజయధ్వానాల నడుమ ఆదివారం వైభవోపేతంగా జరిగింది. మూడు ముళ్ల బంధంతో శ్రీరాముడు, సీతమ్మ తల్లి ఒక్కటైన మధుర క్షణాలు భక్తులను తన్మయత్వంలో ముంచెత్తాయి. తొలుత తిరుకల్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి విష్వక్సేనులను ఆరాధించారు. సీఎం రేవంత్(CM Revanth), గీత దంపతులు ప్రభుత్వం తరఫున సీతారాములకు ముత్యాల తలంబ్రాలు(Mutyala Thalambralu), పట్టువస్త్రాలు సమర్పించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, CS శాంతికుమారితో కలిసి కళ్యాణ క్రతువును వీక్షించారు. పెద్దయెత్తున భక్తులు హాజరయ్యా
రు.
Traditions make a comeback after 9years!
Telangana CM A Revanth Reddy presented pattu vastralu for Sita Rama Kalyanam at Bhadrachalam on Sri Rama Navami pic.twitter.com/m8b6CSSFmH
— Naveena (@TheNaveena) April 6, 2025






