ఏపీలో గ్రూప్-1 (AP Group-1 ) ఉద్యోగాల నియామాకం కోసం నిర్వహించే మెయిన్స్ పరీక్షల (Mains Exam) తేదీలు విడుదలయ్యాయి. మే 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ప్రకటించింది. ప్రిలిమ్స్‌లో (AP Prelims) 4,496 మంది అభ్యర్థులు అర్హత సాధించగా వారిలో 1:50 చొప్పున అభ్యర్థులను మెయిన్స్‌కు సెలెక్ట్ చేసింది.
మేలో మెయిన్స్ పరీక్షలు
2023 డిసెంబర్లో అప్పటి వైస్సార్సీపీ సర్కార్ 89 గ్రూప్-1 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ (AP Group 1 Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. 2024 మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించగా మెయిన్స్ కు.. 4496 మంది అర్హత సాధించారు. ఇక తాజాగా మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. మరో నాలుగు నెలలు సమయం ఉన్నందున అభ్యర్థులు పరీక్షలకు సమర్థంగా ప్రిపేర్ అవ్వాలని ఏపీపీఎస్సీ అధికారులు సూచించారు.
నాలుగు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు
మరోవైపు మెయిన్స్ పరీక్షల కోసం విశాఖపట్నం, విజయవాడ (Vijayawada) , తిరుపతి, అమలాపురంలో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలను డిస్క్రిప్టివ్ టైప్‌లో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి కార్యదర్శి ఐ . నరసింహమూర్తి వెల్లడించారు. మెయిన్స్ ప్రశ్నాపత్రాన్ని ట్యాబ్‌లలో పొందుపరచి ఇవ్వనున్నట్లు తెలిపారు.








