ManaEnadu: గోల్డ్ మెడల్(Gold Medal).. ఏ క్రీడలో అయినా ఎంతో క్రీడాకారులకు అందుకోవాలని ఉవ్విళ్లూరుతారు. అలాంటిది నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఒలింపిక్స్ క్రీడ( Olympic Games)ల్లో అయితే ఆ పతకం వ్యాల్యూ, అది దక్కితే లభించే గౌరవం గురించి మాటల్లో వర్ణించలేం. అలాంటిది తనతోటి మహిళ కాదని ఎంత వాదించినా ఎవరూ వినిపించుకోలేదు. ఏకంగా అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్(IBA) సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇక చేసేదేం లేదని ఆ వ్యక్తితోనే 2024 పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) ఫైనల్‌లో బరిలోకి దిగింది. ఇంకేముంది ఫైనల్లో చైనా బాక్సర్ యంగ్ లూయి( Young Louie)కి షాక్ ఇచ్చి గోల్డ్ మెడల్ కొట్టేసింది. ఇంతకీ ఇదంతా గత ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్(Algerian boxer Imane Khelif) గురించే..
ఆ గేమ్‌లో 46 సెకన్లలోనే గెలుపు
తాజాగా పారిస్ ఒలింపిక్స్-2024లో స్వర్ణం పతకం గెలిచి చరిత్ర సృష్టించిన అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది. తాజా మెడికల్ రిపోర్టుల(Medical Reports)ప్రకారం ఖెలిఫ్‌లో XY క్రోమోజోమ్స్‌లు ఉన్నాయని తేలింది. పురుషుడిలోని టెస్టోస్టిరాన్లూ(Testosterons) ఉన్నాయట. అయినా ఒలింపిక్ కమిటీ పట్టించుకోకపోవడం బాధకరమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగ చైనాకు చెందిన యంగ్ లూయిని కేవలం 46 సెకన్లలలోనే 5-0తో ఖెలిఫ్ గెలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. దీంతో యంగ్ తీవ్ర కన్నీటిపర్యంతమైంది.
ఇప్పటికైనా నిజమేంటో తెలిసిందిగా..
అయితే ఇమానె జెండర్‌పై ఇంకా అనుమానాలు వ్యక్తమవుతుండగా.. భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Former Indian cricketer Harbhajan Singh) ఈ వివాదంపై తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అయిన భజ్జీ.. ఇమానె నుంచి స్వర్ణ పతకం వెనక్కి తీసుకోవాలని(Take the Olympic gold back) సూచించాడు. మెడికల్ రిపోర్ట్ ప్రకారం అతడు పురుషుడేనని తేలిన తర్వాత ఇంకెందుకు అనుమానం అంటూ ప్రశ్నించాడు. ఖెలిఫ్ లింగ గుర్తింపుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ లీక్ కావడం, అందులో కీలక విషయాలు వెల్లడి కావడం క్రీడా వర్గాలను షాక్‌కు గురిచేసిన అంశాన్ని హర్భజన్ గుర్తు చేశాడు.