JD Vance: ఏపీ అల్లుడు.. అమెరికాకు ఉపాధ్యక్షుడు!

ManaEnadu: అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌(America president elections)లో రిపబ్లికన్ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో రెండో సారి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అధ్యక్ష పీటాన్ని దక్కించుకున్నారు. అమెరికాలోని 538 ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్ పార్టీ 270 మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మరో 20 చోట్ల లీడింగ్‌లో ఉంది. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి అయిన ట్రంప్‌కు 277 ఓట్లు రాగా, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌(kamala Harris)కు 224 ఓట్లు వచ్చాయి. దీంతో ట్రంప్ మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు. మరోవైపు ట్రంప్‌కు భారత ప్రధాని మోదీ (PM Modi) సహా ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, రష్యా తదితర దేశాల అధినేతలు విషెస్ చెబుతున్నారు.

 తెలుగింటి అల్లుడు వాన్స్

ఇదిలా ఉండగా అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్(JD Vance) ఎన్నికయ్యారు. ఈ మేరకు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. దీంతో వాన్స్ ఎవరని ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ముఖ్యమైన విషయం ఏంటంటే వాన్స్ మన తెలుగింటి అల్లుడే. అవును మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్‌(AP)లోని కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన ఉషా చిలుకూరి(Usha Chilukuri) భర్తే వాన్స్. ఉష భారత సంతతికి చెందిన మహిళ. ఆమె తల్లిదండ్రులు భారత్(India) నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు.

 2014లో ఉష-వాన్స్ వివాహం

అయితే కాలిఫోర్నియా(California)లోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి పుట్టిపెరిగారు. యేల్ విశ్వవిద్యాలయంలో లా అండ్ టెక్ జర్నల్ కు మేనేజింగ్ ఎడిటర్‌గా, యేల్ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ ఎడిటర్‌గా చేశారు. యేల్ విశ్వవిద్యాలయంలోనే ఉషా, జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. 2014లో వారి వివాహం(Marriage) జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. జేడీ వాన్స్ మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలందించారు. 2022లో అమెరికా సెనేట్ కు తొలిసారిగా ఎన్నికయ్యారు. తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడి(America Vice president)గా ఎంపికయ్యారు.

https://twitter.com/AutismCapital/status/1854073924893757731

Share post:

లేటెస్ట్