Donald Trump: అధికారం ట్రంప్‌దే.. సెలబ్రేషన్స్‌కు అగ్రరాజ్యం సన్నద్ధం!

ManaEnadu: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల(US presidential election results)పై క్రమంగా ఉత్కంఠ వీడుతోంది. మొదట్లో హోరాహోరీ తప్పదంటూ అందరిలోనూ ఉత్కంఠ ఉండేది. కానీ ప్రస్తుత ఎన్నికల ఫలితాల ట్రెండ్ చూస్తే సీన్ రివర్స్ అయినట్లు అందరికీ అర్థం అవుతోంది. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను చూస్తే డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) విజయం దిశగా దూసుకెళ్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దిశగా సాగుతున్నారు. అదే సమయంలో డెమొక్రాట్ కమలా హారీస్(Kamala Harris) వెనుకంజలో ఉన్నట్లు సమాచారం. కాగా అమెరికా అధ్యక్షుడు కావడానికి 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల(Electoral college votes)లో 270 ఓట్లు రావాల్సి ఉండగా.. ప్రస్తుతం ట్రంప్‌ 248, హారిస్‌ 214 ఆధిక్యంలో ఉన్నారు.

నిరాశలో హారిస్ మద్దతుదారులు

మరోవైపు కమలా హారీస్(Kamala Harris) మద్దతుదారులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. ఇందులో భాగంగానే కమలా హారిస్ ప్రసంగం వాషింగ్టన్‌లోని హూవార్డ్ యూనివర్సిటీ(Howard University)లో జరగాల్సి ఉంది. కానీ కమలా హారిస్ మాత్రం ఆ ప్రసంగానికి హాజరుకాకుండా తిరిగొచ్చేశారు. దీనిపై ఆమె సహచరుడు సెడ్రిక్ రిచ్‌మండ్(Cedric Richmond) హూవార్డ్ వద్ద మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఇంకా చాలా ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉందని.. అందుకే ఇవాళ కమలా హారిస్ ప్రసంగం లేదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ట్రంప్ మద్దతుదారులు(Trump supporters) సెలబ్రేషన్స్‌కు రెడీ అయిపోయారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న కన్వెన్షన్ సెంటర్‌లో వియోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఈ వేడుకకు ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉంది.

ట్రంప్‌కు పాలనలో సాయపడతా: ఎలాన్ మస్క్

ఇదిలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే ప్రభుత్వ పాలనలో ఆయనకు సాయపడతానని బిలియనీర్ ఎలాన్ మస్క్(Billionaire Elon Musk) అన్నారు. ఫెడరల్ ఏజెన్సీల సంఖ్యను కుదిస్తానని పేర్కొన్నారు. ‘మన బ్యూరోక్రసీ(Bureaucracy) చాలా పెద్దది. పైగా మన దేశంలో నియంత్రణలు ఎక్కువ. వాటిని తగ్గించాల్సి ఉంది. అమెరికాను మరింత మెరుగ్గా నిర్మించేవాళ్లకు సాయపడాలి’ అని టక్కర్ కార్ల్‌సన్‌షోలో వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ కచ్చితంగా గెలుస్తారని మస్క్ నమ్మకంతో ఉన్నారు.

https://twitter.com/SirAshu2002/status/1854056486596739295

Share post:

లేటెస్ట్