ManaEnadu: అమెరికా ఎన్నికల తొలి ఫలితాలు(US polls) వెలువడుతున్నాయి. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ముందంజలో ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్(Kamala Harish) కొంచెం వెనుకబడ్డారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల సమయానికి ఓక్లహోమా, మిస్సోరి, ఇండియానా, కెంటకీ, టెన్నిసీ, అలబామా, ఫ్లోరిడా, వెస్ట్ వర్జీనియా, దక్షిణ కరోలినా, అర్కాన్సస్ ల్లో రిపబ్లికన్లు ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు ట్రంప్‌కి 198 ఎలక్టోరల్ సీట్లు లభించగా.. కమలాకి 112 ఎలక్టోరల్ సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్(Swing state) జార్జియాలో కమలా విజయం కోసం తీవ్రంగా పోరాడుతున్నారు.
మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో ట్రంప్
ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఏ పార్టీ అయినా మొత్తం 270 సీట్లు గెలవాల్సి ఉంటుంది. మరోవైపు ట్రంప్ ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ వెర్మాంట్ (3), మసాచుసేట్స్ (11), మేరీల్యాండ్ (10), డెలావేర్ (3), కనెక్టికట్ (7), న్యూ జెర్సీ(14) రాష్ట్రాల్లో గెలుపొందారు. ఈ ఆరు రాష్ట్రాల్లో 44 సీట్లు ఉన్నాయి. ప్రపంచంలోనే సంక్లిష్టమైన ఎన్నికలుగా పేరుందిన అమెరికా అధ్యక్ష పదవి(Us President Race) రేసులో కమలా హ్యారిస్, ట్రంప్ కోసం గట్టిపోటీ నెలకొంది.
అదే జరిగితే దేశ భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నట్లే: కమల
మరోవైపు ఎన్నికలు ముగిసే కాసేపు ముందు ట్రంప్ సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేశారు. ఫిలడెల్ఫియా, డెట్రాయిట్ రాష్ట్రాల ఎలక్షన్స్ లో చీటింగ్ జరుగుతున్నట్లు తనకు తెలిసిందని ఆ పోస్ట్ లో రాశారు. 2020 ఎన్నికల్లో కూడా తనకు ఈ విధంగానే పెద్ద స్థాయిలో అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. కానీ కమలా హారిస్ మాత్రం అమెరికా అధ్యక్షుని(President)గా ట్రంప్ మరోసారి విజయం సాధిస్తే దేశ భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నట్లేనని వ్యాఖ్యానించారు.