Health News ” ‘మీ భర్తకు బీపీ ఉందా.. ఐతే మీకూ వస్తుందట’

Mana Enadu: సాధారణంగా ఒక కుటుంబం (Family) లో ముందు తరానికి ఏవైనా వ్యాధులు ఉంటే జన్యుపరంగా అవి తర్వాత తరాలకు సంక్రమించే ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే అలా జన్యుపరమైన (Heredity) వ్యాధులతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎలాంటి రక్తసంబంధం లేని భార్యాభర్తల విషయంలోనూ ఇలాంటి వ్యాధులు సంక్రమించే ఆస్కారం ఉందట. అయితే ఇవి జన్యుపరమైన వ్యాధులు కాదండోయ్. మీ లైఫ్ పార్ట్నర్కు హై బీపీ ఉందనుకోండి.. ఆ సమస్య మీకూ తలెత్తే ఛాన్స్ ఉందట. అదెలాగంటారా?

భార్య నుంచి భర్తకు బీపీ

అట్లాంటాలో ఎమరీ గ్లోబల్‌ డయాబెటిస్‌ రీసెర్చి సెంటర్‌లో ఫ్యాకల్టీగా పనిచేసే జితిన్‌ సామ్‌ వర్గీస్‌ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సాధారణంగా భార్యాభర్తలు (Husband And Wife) ఏళ్ల పాటు కలిసి ఉంటారు. దీనివల్ల తెలియకుండానే వారిలో ఒకరి ఆసక్తులు మరొకరికి, ఒకరి ఇష్టాలు ఇంకొకరికి, అలా లైఫ్ స్టైల్, ఫుడ్ హాబిట్స్, ఆరోగ్య పరిస్థితులు ఇలా ఒకరి నుంచి మరొకరికి అలవాటవుతాయట.

అమెరికా, ఇంగ్లండ్‌, చైనా, భారతదేశాల (India)కు చెందిన వేలాది దంపతుల నుంచి సేకరించిన ఆరోగ్య సమాచారం నుంచి ఈ రకమైన నిర్ధారణకు వచ్చారు జితిన్. అయితే వీటిలో రక్తపోటు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉండేలా భార్యాభర్తలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ‘జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ (Journal Of American Heart Association)’లో ప్రచురితమైన అధ్యయనం సూచించింది. ఈ అధ్యయనం ఇంకా అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అవేంటంటే?

ఒత్తిడి వల్ల బరువు పెరుగుదల

సాధారణంగా చాలా మంది ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటారు. అలా ఎందుకు జరుగుతుందంటే.. స్ట్రెస్ (Stress)లో ఉన్నప్పుడు ఏం తిన్నా దాని రుచి తెలియదు. అందువల్ల ఎంత తిన్నా మన నాలుక సంతృప్తి చెందదు. అందుకే అలా సాటిస్ఫై అయ్యే వరకు ఏదో ఒకటి తింటూనే ఉండటం వల్ల ఎక్కువ తినేసి బరువు పెరిగిపోతుంటామని ‘ఫిజియాలజీ అండ్‌ బిహేవియర్‌ (Physiology and Behavior)’ జర్నల్‌ తేల్చింది. అలా అధిక బరువుకు ఒత్తిడి ప్రధాన కారణంగా మారుతోందట.

ఒత్తిడిలో ఉన్నప్పుడు తిండికి దూరం

ఇందుకోసం 76 మందిని ఎంచుకున్న పరిశోధకులు (Researchers) వారిని తక్కువ, ఎక్కువ ఒత్తిడి వర్గాలుగా విభజించారు. ఆ తర్వాత వీరిని తక్కువ ఒత్తిడి, ఎక్కువ ఒత్తిడి వర్గాలుగా విభజించారు. వారికి తీయదనం, కారంగా ఉండే రెండు సూప్లను ఇచ్చి ఎంత కావాలంటే అంత తాగమని చెప్పారట. అలా తక్కువ ఒత్తిడిలో ఉన్నవారు కాస్త తాగగానే పక్కన పెట్టేయగా.. ఒత్తిడిలో ఉన్న వారు మాత్రం ఎంత తాగినా సంతృప్తి చెందలేదట. అందుకే ఒత్తిడిలో ఉన్నప్పుడు తిండికి కాస్త దూరంగా ఉండటమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *