Rain Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం(Rain) దంచికొడుతోంది. ఉరుములు మెరుపులతోపాటు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. కాగా శుక్రవారం మధ్యాహ్నం వరకూ తీవ్ర ఎండగా ఉన్నప్పటికీ సాయంత్రం 4 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో మేఘాలు కమ్మేశాయి. దీంతో వర్షం కురుస్తోంది. ఈ మేరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సచివాలయం, సికింద్రాబాద్, తార్నాక, కూకట్ పల్లి, యూసఫ్‌గూడ, నాంపల్లి, ఫిలింనగర్, గచ్చిబౌలి, చిక్కడపల్లి తదితర ప్రాంతాలతో పాటు మరికొన్ని చోట్ల వర్షం దంచికొడుతుంది.

ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: GHMC

అలాగే దిల్‌సుఖ్‌నగర్, LB నగర్, కొత్తపేట, హయత్ నగర్, ఉప్పల్‌తో మరికొన్ని ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్(Traffic Jam) ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా మరో 3 గంటలపాటు నగరాన్ని ఈ కుండపోత వర్షం కొనసాగనుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, మ్యాన్ హోల్స్ ప్రాంతాల్లో సురక్షితంగా ఉండాలని GHMC అధికారులు అలర్ట్స్ జారీ చేశారు.

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

ఇదిలా ఉండగా తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

Related Posts

Rains: తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అన్నదాత ఆందోళన!

అకాల వర్షాలు(Rains) పలు ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు ముఖ్యంగా అన్నదాత అల్లాడిపోతున్నాడు. పంటలు చేతికొచ్చాయన్న ఆనందం కళ్లాల్లోనే కనుమరుగవుతోంది. ఐకేపీ సెంటర్ల(IKP Centers)లో పోసిన ధాన్యం అనుకోని వర్ష విలయానికి తడిసి ముద్దవుతోంది. దీంతో అన్నదాత(Farmers)కు…

Rain Alet: రానున్న మూడు రోజులు వర్షాలు!

తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) ప్రకటించింది. ఈ మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు(Maximum temperatures) సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *