చెన్నె, బెంగళూరు, ఏపీ, తెలంగాణ.. దక్షిణాదిని వణికిస్తున్న వరణుడు

Mana Enadu : దక్షిణాదిలో వరణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాల(Heavy Rains)తో దక్షిణాదిన పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇక తమిళనాడు, కర్ణాటక రాజధానులైన చెన్నై, బెంగళూరు(Bengaluru Rains)ను వానలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు ఇక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు గత నాలుగు రోజులుగా ఏపీని వర్షాలు వణికిస్తున్న విషయం తెలిసిందే.

వాన భయంతో హోటళ్లకు ధనవంతులు

చెన్నై వ్యాప్తంగా కురుస్తున్న అత్యంత భారీ వర్షాల(Chennai Floods)తో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే నగరంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వరదలకు భయపడి చాలా మంది  ఐటీ నిపుణులు, ధనవంతులు విలాసవంతమైన హోటళ్లలో గదులు బుక్‌ చేసుకుని కుటుంబాలతో అక్కడికి వెళ్లిపోతున్నారు. గతేడాది డిసెంబరులో నెలకొన్న పరిస్థితులు రిపీట్ అవుతాయేమోనన్న భయంతో హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. 

బెంబేలెత్తుతున్న బెంగళూరు

మరోవైపు భారీ వర్షాలకు బెంగళూరు(Bangalore Rains) కూడా బెంబేలెత్తిపోతోంది. చిక్కబళ్లాపుర, కోలారు, రామనగర, మైసూరు, చామరాజనగర, ఉడుపి, మంగళూరు, ఉత్తర కర్ణాటక, చిత్రదుర్గ జిల్లాల్లోనూ కురుస్తున్న భారీ వర్షాలతో చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. రహదారులపైకి నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వానలతో తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలం

ఇక వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు(AP Rains) కురుస్తున్నాయి. విశాఖపట్టణం, కాకినాడ తీరాల్లో కల్లోలం నెలకొంది. మరోవైపు రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, గుంటూరు, ఉమ్మడి నెల్లూరు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో భారీ వానలతో జనజీవనం స్తంభించిపోయింది. శ్రీసత్యసాయి జిల్లాలోని చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వెల్దుర్తి, గంగినేపల్లి తండాలకు, ఎర్రోనిపల్లి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా జిల్లాల్లో వరి, మొక్కజొన్న, వేరుశనగ రైతులకు నష్టం వాటిల్లింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో, హైదరాబాద్(Hyderabad Rains) మహానగరంలో వర్షాలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.

Share post:

లేటెస్ట్