‘Fauji’లో రజాకార్ల సీక్వెన్స్.. కీలక పాత్రలో హాలీవుడ్ యాక్టర్!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘ఫౌజీ (Fauji)’ అనే టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రం పూజా కార్యక్రమం నుంచి భారీ అంచనాలు క్రియేట్ చేసింది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తరచూ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

రజాకార్ ఎపిసోడ్ 

తాజాగా ఫౌజీ గురించి ఓ న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో హను రాఘవపూడి (Hanu Raghavapudi) రజాకార్ల ఎపిసోడ్ తో ఓ సీక్వెన్స్ రూపొందిస్తున్నారట. ఈ సీక్వెన్స్ భారీ యాక్షన్ తో చాలా ఎమోషనల్ సీన్స్ తో తీయనున్నారట. ఈ మూవీకే ఈ సీక్వెన్స్ హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. దీనికి సంబంధించిన సీన్స్ ను మార్చిలో షూట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

ఫౌజీలో హాలీవుడ్ యాక్టర్

అయితే ఈ రజాకార్ ఎపిసోడ్ లో ఓ కీలక పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందట. అందుకే ఈ పాత్ర కోసం ఓ హాలీవుడ్ నటుడి (Hollywood Actor)ని రంగంలోకి దింపుతున్నారట. ఆ నటుడు ఈ పాత్ర కోసం దాదాపుగా ఆరు నెలల నుంచి మేకోవర్ అవుతున్నట్లు సమాచారం. అయితే అతడెవరనేది మాత్రం మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారట. ఇక ఫౌజీ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంద‌ని, మునుపెన్న‌డూ చూడ‌ని యాంగిల్ లో ప్ర‌భాస్ ఈ ఫ్లాష్ బ్యాక్ లో క‌నిపించ‌నున్నాడ‌ని సినీ వర్గాల్లో టాక్.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *