బుల్లితెర మెగాస్టార్ ప్రభాస్ తనయుడు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ (Chandrahas) నటిస్తున్న మరో మూవీ బరాబర్ ప్రేమిస్తా. సంపద్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా రెడ్డి మామ అనే పాటను ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) విడుదల చేశారు. ఈ చిత్రాన్ని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సీసీ క్రియేషన్స్, ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.
రెడ్డి మామ మాస్ బీట్
తాజాగా రెడ్డి మామ (Reddy Mama) అంటూ సాగే మాస్ బీట్ ను దిల్ రాజు రిలీజ్ చేశారు. సురేశ్ గంగుల లిరిక్స్ అందించిన ఈ పాటను నకాష్ అజిజ్, సాహితి చాగంటి పాడారు. ఆర్ఆర్ ధ్రువణ్ మ్యూజిక్ అందించారు. ఈ పాటను రిలీజ్ చేసిన అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్‌గా ఈ పాట ఉందని అన్నారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. త్వరలోనే రిలీజ్ కాబోతోన్న ఈ చిత్రానికి వైఆర్ శేఖర్ కెమెరామెన్‌గా, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్‌గా పని చేశారు.






