Khairatabad Ganesh: గంగమ్మ ఒడికి గణనాథుడు.. ముగిసిన ఖైరాతాబాద్ గణేశుడి నిమజ్జనం

ManEnadu: ఖైర‌తాబాద్ మ‌హా గ‌ణ‌నాథుడు(Khairatabad Maha Ganesh) గంగ‌మ్మ ఒడికి చేరాడు. ఈ ఏడాది సప్తముఖ మాహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన లంబోదురుడు 11 రోజుల పూజల అనంతరం తల్లి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. స‌రిగ్గా 1.34 గంటలకు మహా గణపతి నిమజ్జనం పూర్తయింది. మ‌హా గ‌ణ‌ప‌తి నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా చూసి తరించేందుకుభ‌క్తులు భారీ సంఖ్యలో త‌ర‌లివ‌చ్చారు. దీంతో హుస్సేన్ సాగ‌ర్(Hussain Sagar) ప‌రిస‌ర ప్రాంతాలు ‘గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా’ నినాదాల‌తో హోరెత్తిపోయాయి. మహా గణపతి నిమజ్జనాన్ని చూసి భ‌క్తులు తరించిపోయారు. NTR మార్గ్ క్రేన్ నంబ‌ర్ 4 వ‌ద్ద గణపయ్యకు చివరి పూజలు నిర్వహించి నిమజ్జనం కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

శోభాయాత్ర సాగిందిలా..

అంతకు ముందు ఖైరతాబాద్ మహా గణేషుడి శోభాయాత్ర కన్నుల పండుగలా సాగింది. ఇవాళ ఉదయం 6 గంటలకే చివరి పూజల అనంతరం గణపతి శోభాయాత్ర ప్రారంభించారు. టెలిఫోన్‌ భవన్‌(Telephone Bhawan), తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం(Secretariat) మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌(NTR Marg), ట్యాంక్ బండ్‌(Tank Bund)కు శోభాయాత్ర చేరుకుంది. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 4 దగ్గర పూజల అనంతరం ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం జరిగింది. సూపర్ క్రేన్ సాయంతో నిమజ్జనాన్ని పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేశారు. అంతకు ముందు సీఎం రేవంత్(CM Revanth) ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలను పరిశీలించారు. నిమజ్జనం ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

 70 ఏళ్లుగా వివిధ రూపాల్లో..

70 ఏళ్లుగా(70 years) ఖైరతాబాద్‌లో వివిధ రూపాల్లో పూజలందుకున్న గణేశుడు, ఈసారి 70 అడుగుల మట్టి ప్రతిమతో ప్రపంచంలోనే ఎత్తయిన మట్టి గణపతిగా రికార్డుకు ఎక్కాడు. స్వామికి ఓ వైపు రాహుకేతుల విగ్రహాలు, మరోవైపు అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఉక్కు, మట్టితో చేసిన ఈ భారీ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మట్టి విగ్రహంగా నిలిచి భక్తులను మరింత ఆకట్టుకుంది. ఇక ప్రధాన గణపతి మండపానికి ఓవైపు శ్రీనివాస కల్యాణం, మరోవైపు శివపార్వతుల కల్యాణ ఘట్టాలకు సంబంధించిన ప్రతిమలను చిన్న మండపాల్లో ఏర్పాటు చేయటం విశేషం.

Share post:

లేటెస్ట్