మన ఈనాడు, హైదరాబాద్:
కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గంలో చాపకింద నీరులా జనంలోకి విస్తరించింది. అభ్యర్థి మందముల పరమేశ్వరరెడ్డి చేస్తున్న ప్రచారంలో ప్రజలు ప్రేమతో స్వాగతం పలుకుతున్నారు. ఆత్మీయ పలకరింపుతో ప్రజలే కాంగ్రెస్ అభ్యర్థికి ధైర్యం నింపుతున్నారు.
ఇప్పటికే కాప్రా అధికారపార్టీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ బీఆర్ఎస్ పార్టీ పోకడలు నచ్చకపోవడంతో హస్తం గూటికి చేరారు. బలమైన ఓటు బ్యాంకు ఈసారి హస్తం పార్టీకి పడుతుందని భావిస్తున్నారు. ఏఎస్‌రావునగర్ డివిజన్లో పూర్తిగా చైతన్యవంతమైన ప్రాంతం. అక్కడి ఓటర్లు ఉన్నతవర్గాలకు చెందినవారే అధికం.కారు పార్టీ దగ్గరగానే ఉంటూనే హస్తం పార్టీ గెలుపుకు గ్రౌండ్లో పనిచేస్తున్నారు.
ఎమ్మెల్యే బేతి ప్రధాన అనుచరులుగా ముద్రవేసుకున్న జనంపల్లి వెంకటేశ్వరరెడ్డి, గరిక సుధాకర్ వర్గం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పది డివిజన్లలో వీరి ప్రభావం స్పష్టం కనిపిస్తుంది. న్యూట్రల్‌గా ఉన్న ఓటర్లుపై దృష్టి సారించారు. ఉప్పల్ హస్తం పవర్ చూపించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్దం అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఉప్పల్ ప్రజలు అధికారపార్టీకి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వబోతున్నారని జనం చర్చించుకుంటున్నారు.
Chintakani: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత
–నరేష్ చిట్టూరి ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా…