మనకు అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు వెంటనే గుర్తొచ్చేది లోన్. ఈ మధ్య కాలంలో గ్రామాల్లో కూడా హోమ్ లోన్స్ తీసుకోవడం సాధారణమైంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. లోన్ తీసుకున్న వ్యక్తి అకాల మరణం(Loan Borrower Dies) చెందితే రుణం(Loan) రద్దవుతుందా? లేక కుటుంబం చెల్లించాల్సి వస్తుందా? అనే విషయం తెలుసుకుందాం.
పర్సనల్ లోన్ అయితే ఏమైతుంది?
పర్సనల్ లోన్‌లు(Parsnal Loans) లేదా క్రెడిట్ కార్డులు(Credit Cards) అన్‌సెక్యూర్డ్ రుణాలు(Unsecured Loan ).. వీటికి ఎటువంటి ఆస్తి హామీగా ఉండదు. ఈ కారణంగా లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, బ్యాంకులు ఆ బకాయిలను(EMI) కుటుంబసభ్యుల నుంచి వసూలు చేయలేవు. ఎలాంటి కో-అప్లికెంట్ లేకపోతే లేదా గ్యారెంటీ లేకపోతే, బ్యాంకు ఆ లోన్‌ను రికవర్ చేయకుండా రద్దు చేసే అవకాశం ఉంది.
హోమ్ లోన్‌లో పరిస్థితి ఎలా ఉంటుంది?
హోమ్ లోన్స్‌లో సాధారణంగా కో-అప్లికెంట్ కూడా ఉంటారు. ఒకరు మరణిస్తే, మిగిలిన కో-అప్లికెంట్ అప్పు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మృతుడి సమాచారం బ్యాంకుకు తెలియజేయాలి. అప్పుడు అతని పేరుతో ఉన్న లోన్, అకౌంటు రద్దవుతుంది. కో-అప్లికెంట్‌కి పూర్తి బాధ్యత బదిలీ అవుతుంది.
ఇన్సూరెన్స్ ఉంటె పర్లేదు..
హోమ్ లోన్ తీసుకున్నప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటే, రుణగ్రహీత మరణించినప్పుడు బీమా కంపెనీ మొత్తం లోన్‌ను కవర్ చేస్తుంది. ఇది కో-అప్లికెంట్‌పై భారం పడకుండా చూసే మార్గం. అయితే పర్సనల్ లోన్స్‌కి ఈ విధమైన బీమా చాలా అరుదుగా ఉంటుంది.
లోన్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా, కో-అప్లికెంట్ లేదా గ్యారెంటర్ ఉంటే వారి బాధ్యతలను ముందుగానే తెలుసుకోవడం ఎంతో అవసరం.






