IPL 2025: అభిమానులకు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ రీస్టార్ట్ ఎప్పుడంటే?

పహల్గాం ఉగ్రదాడి (Terrorist Attack) అనంతరం భారత్‌ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్థాన్‌(Pakistan) ఉక్కిరిబిక్కిరయ్యింది. ప్రతిదాడులు చేసేందుకు దాయాది దేశం యత్నించినప్పటికీ.. భారత బలగాల దెబ్బకు తోకముడిచింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని పాక్‌ (Pakistan) కోరడంతో అందుకు భారత్‌ అంగీకరించగా.. కాల్పుల విరమణ(Ceasefire) అమల్లోకి వచ్చింది. ఈ వ్యవహారంలో సైన్యంలోని MGMO స్థాయి అధికారులు కీలకంగా వ్యవహరించారు. పరిస్థితులు తీవ్ర రూపం దాల్చుతున్న వేళ వీరి మధ్య పరస్పర అవగాహనతో ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడినట్లయ్యింది.

రేపు కీలక ప్రకటన?

ఇదిలా ఉండగా భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల మధ్య ఐపీఎల్(Indian Premier League) వారం వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఇరుదేశాలు కాల్పుల నిలిపివేతకు అంగీకరించడంతో ఐపీఎల్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు IPL ప్రారంభంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ‘రేపు IPL గవర్నింగ్ కౌన్సిల్, ఆఫీస్ బేరర్స్, ఫ్రాంచైజీల యజమానులు సమావేశం జరుగుతుంది. త్వరలోనే ఐపీఎల్ నిర్వహణ కమిటీ, BCCI కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది’ అని తెలిపారు. దీంతో ఎక్కడైతే ఐపీఎల్ ఆగిందో అక్కడి నుంచే ప్రారంభం కానుంది. కాగా ఈనెల 8న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్(DC vs PBKS) మధ్య మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా మే 15 లేదా 16వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుందనే వార్తలు సోషల్ మీడియా(SM)లోనూ వైరల్ అవుతున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *