
భాగ్యనగరం మరో ప్రతిష్ఠాత్మక వేడుకకు వేదికగా నిలిచింది. 72వ మిస్ వరల్డ్ 2025 పోటీల(Miss World 2025 Pageant)కు హైదరాబాద్(Hyderabad) వేదికైంది. నగరంలోని గచ్చిబౌలి స్టేడియం(Gachibowli Stadium)లో ఈ అందాల పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. విశ్వసుందరి కిరీటం(Miss Universe crown) దక్కించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా 110కి పైగా దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. భారత్ తరఫున మిస్ ఇండియా నందిని గుప్తా(Miss India Nandini Gupta) ఈ పోటీల్లో పాల్గొన్నారు. కాగా ఈ అందాల పోటీలు మే 31 వరకు దాదాపు 22 రోజుల పాటు జరగనున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా..
ప్రారంభోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సంస్కృతి(Culture of Telangana state), సంప్రదాయాలు ఉట్టిపడేలా సాగింది. ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతాలాపనతో పోటీలు అధికారికంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా 250 మంది కళాకారులు ప్రదర్శించిన పేరిణి నృత్యం(Perini dance) ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. పరిచయ కార్యక్రమంలో భాగంగా వివిధ దేశాల నుంచి వచ్చిన పోటీదారులు తమ తమ విభిన్న వస్త్రధారణలతో ర్యాంప్‌పై హోయలొలికించారు.
The 72nd #MissWorld2025 is now open. The world will see the new Miss World on 31 May 2025.#Missworld2025#hyderbad pic.twitter.com/eCcRH8vYLG
— Md Zamir Hasan (@MdZamirha) May 10, 2025
ప్రారంభోత్సవ వేడుకకు హాజరైన సీఎం రేవంత్
ఈ ప్రారంభోత్సవ వేడుక(Inauguration Ceremony)కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి(TG CM Revanth Reddy), CS రామకృష్ణారావు, DGP జితేందర్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ CEO జూలియా మోర్లే, మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా(Christina Piskova) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
CM Revanth Reddy and Minister Jupally Krishna Rao inaugurated the Miss World-2025 competition.
అందగత్తెలు అందరూ ఒకే చోట ఉన్నారు అందులోనూ హైదరాబాద్ లో ఉన్నారు 🤩❣️#MissWorld2025 #MissWorldHydarabad pic.twitter.com/MJkn6NWIcX
— Mr.RK (@RavikumarJSP) May 10, 2025