Mana Enadu: సీతాఫలం(Custard Apple) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శీతాకాలం(Winter Season) ప్రారంభమైందంటే అందరికీ గుర్తుకు వచ్చేది సీతాఫలం. వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా సీతాఫలాలు కనిపిస్తుంటాయి. వెరీ టేస్టీగా ఉండే ఈ ఫ్రూట్(Fruit)ని తినేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. అయితే డయాబెటిస్ (Diabetes)ఉన్న వారు సీతాఫలాలు తినొచ్చా అనే సందేహం షుగర్ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. సాధారణంగా సీతాఫలం రుచి తియ్యగా ఉంటుంది. ఈ కారణంగానే సీతాఫలాన్ని తీసుకోవాలంటే డయాబెటిస్‌తో బాధపడేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. అసలు డయాబెటిస్ ఉన్నవారు సీతాఫలాన్ని తినొచ్చా..? తినకూడదా? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..
ఎంత ఇష్టమైనా సరే నోరూ కట్టేసుకోవాల్సిందే
ప్రస్తుతం చాలామంది డయాబెటిస్(Diabetes)తో బాధపడుతున్నారు. అత్యధికంగా ఇండియాలోనే ఈ డయాబెటిస్ వ్యాధితో ఎక్కువమంది ఇబ్బంది పడుతున్నారని పలు అధ్యయనాలు (Studies)కూడా చెబుతున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి డయాబెటిస్ పెద్ద సమస్యగా మారింది. బిజీ లైఫ్ కారణంగా మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ఈ మధుమేహ వ్యాధికి కారణం అని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీరి ఆహారపు అలవాట్లు కాస్త వేరుగా ఉంటాయి. ఎంత ఇష్టమైన సరే ప్రతిదీ తినలేరు. అది ఫుడ్ అయినా.. ఫ్రూట్స్ అయినా సరే.
బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం
ముఖ్యంగా ఈ సీతాఫలం(Custard Apple)లో అధిక మోతాదులో యాంటీ యాక్సిడెంట్స్(Antioxidants), కేరటనోయిడ్స్, ఫ్లెవోనోయిడ్స్, విటమిన్ సీ, బి6, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఫైబర్ ఇవన్నీ అధికంగా ఉంటాయి. గ్లైసమిక్ ఇండెక్స్ కలిగిన పండ్లలో ఈ సీతాఫలం(54-55) కూడా ఉంటుందని న్యూట్రీషియనిస్టులు(Nutritionists) బుతున్నారు. అందుకే సీతాఫలం(Sitaphal)తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్(Blood sugar levels) పెరిగే అవకాశం ఉంటుంది. కానీ మరీ ఎక్కువ స్థాయిలో షుగర్ లెవల్స్ పెరుగుతాయన్నదాంట్లో నిజం లేదు. మోతాదుకు మించి కాకుండా రోజుకు ఒకటి, రెండు పండ్లను తీసుకుంటే పెద్దగా నష్టం ఉండదని నిపుణులు అంటున్నారు.