Israel Airsrikes: లెబనాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం.. 100 మందికిపైగా మ‌ృతి

Mana Enadu: లెబనాన్‌(Lebanon)పై ఇజ్రాయెల్(Israel) క్షిపణుల వర్షం(airstrikes) కురిపిస్తోంది. తాజాగా ఓ భారీ అపార్ట్‌మెంట్‌పై రాకెట్ల వర్షం కురిపించింది. దీంతో క్షణాల్లోనే ఆ భారీ భవనం కుప్పకూలింది. ఈ విషాద ఘటనలో 100 మందికిపైగా అక్కడిక్కడే మృతి చెందారు. మరో 200 మంది గాయాలపాలయ్యారు. హెజ్బొల్లా దళాల(Hezbollah Forces)ను అంతమొందించడమే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటిచింది. మరోవైపు రోజురోజుకు ఇజ్రాయెల్ దాడులు అధికమవుతున్నాయి. ఇప్పటికే హెజ్బొల్లా కీలక నేతలు హసన్ నస్రల్లా, యాహ్యా సిన్వర్‌తో పాటు పలువురు కీలక నేతలు కూడా ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందారు.

 భారీ అపార్ట్‌మెంట్లే లక్ష్యంగా దాడులు

మరోవైపు భారీ అపార్ట్‌మెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఫైటర్ రాకెట్లు(Israeli fighter rockets) విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ దాడుల్లో వందల మంది ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. భవనాల శిథాలాల కింద వందల సంఖ్యలో మృత దేహాలు పడి ఉన్నాయి. క్షిపణుల దాడి(Missile attack)కి చాలా మంది శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో మృతులను గుర్తుపట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడులతో ప్రజల హాహాకారల వల్ల ఘటనాస్థలంలో భీకర పరిస్థితులు నెలకొన్నాయి.

జనావాసాల్లోనే ఉగ్ర కార్యకలాపాలు

మరోవైపు హెజ్బొల్లా ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థికంగా సపోర్ట్(Financial Support) చేసే ప్రాంతాలకు సమీపంలో ఉంటున్న ప్రజలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. లెబనాన్ వ్యాప్తంగా ఉన్నటువంటి ‘అల్ ఖర్ద్ అల్ హసన్(Al Qard Al Hassan)’ బ్రాంచీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని చెప్పింది. అయితే అల్‌ ఖర్ద్ అల్ హసన్ అనేది లైసెన్స్ లేని గ్రే-మార్కెట్ బ్యాంక్(Grey-market bank). ప్రస్తుతం హెజ్బొల్లాకు నిధులు సమకూర్చేందుకు ప్రధాన ఆర్థిక వనరుగా పనిచేస్తోంది. లెబనాన్‌లో దీనికి దాదాపు 30 బ్రాంచీలు ఉన్నాయి. ఇందులో సగం బీరుట్‌(Beirut)లోని రద్దీ అయిన ప్రదేశాలు, జనావాస ప్రాంతాల్లోనే ఉన్నాయి.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *