Mana Enadu: లెబనాన్(Lebanon)పై ఇజ్రాయెల్(Israel) క్షిపణుల వర్షం(airstrikes) కురిపిస్తోంది. తాజాగా ఓ భారీ అపార్ట్‌మెంట్‌పై రాకెట్ల వర్షం కురిపించింది. దీంతో క్షణాల్లోనే ఆ భారీ భవనం కుప్పకూలింది. ఈ విషాద ఘటనలో 100 మందికిపైగా అక్కడిక్కడే మృతి చెందారు. మరో 200 మంది గాయాలపాలయ్యారు. హెజ్బొల్లా దళాల(Hezbollah Forces)ను అంతమొందించడమే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటిచింది. మరోవైపు రోజురోజుకు ఇజ్రాయెల్ దాడులు అధికమవుతున్నాయి. ఇప్పటికే హెజ్బొల్లా కీలక నేతలు హసన్ నస్రల్లా, యాహ్యా సిన్వర్‌తో పాటు పలువురు కీలక నేతలు కూడా ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందారు.
భారీ అపార్ట్‌మెంట్లే లక్ష్యంగా దాడులు
మరోవైపు భారీ అపార్ట్‌మెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఫైటర్ రాకెట్లు(Israeli fighter rockets) విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ దాడుల్లో వందల మంది ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. భవనాల శిథాలాల కింద వందల సంఖ్యలో మృత దేహాలు పడి ఉన్నాయి. క్షిపణుల దాడి(Missile attack)కి చాలా మంది శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో మృతులను గుర్తుపట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడులతో ప్రజల హాహాకారల వల్ల ఘటనాస్థలంలో భీకర పరిస్థితులు నెలకొన్నాయి.
జనావాసాల్లోనే ఉగ్ర కార్యకలాపాలు
మరోవైపు హెజ్బొల్లా ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థికంగా సపోర్ట్(Financial Support) చేసే ప్రాంతాలకు సమీపంలో ఉంటున్న ప్రజలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. లెబనాన్ వ్యాప్తంగా ఉన్నటువంటి ‘అల్ ఖర్ద్ అల్ హసన్(Al Qard Al Hassan)’ బ్రాంచీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని చెప్పింది. అయితే అల్ ఖర్ద్ అల్ హసన్ అనేది లైసెన్స్ లేని గ్రే-మార్కెట్ బ్యాంక్(Grey-market bank). ప్రస్తుతం హెజ్బొల్లాకు నిధులు సమకూర్చేందుకు ప్రధాన ఆర్థిక వనరుగా పనిచేస్తోంది. లెబనాన్‌లో దీనికి దాదాపు 30 బ్రాంచీలు ఉన్నాయి. ఇందులో సగం బీరుట్(Beirut)లోని రద్దీ అయిన ప్రదేశాలు, జనావాస ప్రాంతాల్లోనే ఉన్నాయి.