హైదరాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు (Hyderabad IT Raids) కలకలం రేపుతున్నాయి. నగరంలోని రెండు సంస్థలపై ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల దాడులు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన దిల్‌రాజు (Dil Raju) సోదరుడు, కుమార్తె ఇళ్లల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
దిల్ రాజు పార్టనర్స్ ఇళ్లలో సోదాలు
దిల్ రాజు సోదరుడు శిరీష్ (Sirish), కుమార్తె హన్సిత రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని నివాసాల్లో ఈ తనిఖీలు చేపడుతున్నారు. అంతే కాకుండా దిల్‌రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లపైన ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 50 ఐటీ బృందాలు అనేకచోట్ల సోదాలు చేస్తున్నాయి.
ఒకటి హిట్.. మరొకటి ఫ్లాప్
ఇటీవలే దిల్ రాజు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’ సినిమా నిరాశ పరచడంతో దిల్ రాజు పని అయిపోయినట్టేనని అంతా భావించారు. కానీ విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ సినిమా చివరి నిమిషంలో తమను ఆదుకుందని దిల్ రాజు చెప్పిన విషయం తెలిసిందే. అనిల్ లేకపోతే తాము లేమంటూ శిరీష్, దిల్ రాజు పలు ఇంటర్వ్యూల్లో పదే పదే చెబుతుండటం గమనార్హం.






