మన ఈనాడు:
ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ మరో భారీ షాక్ తగిలింది. సింగిరెడ్డి దంపతులు బీఆర్ఎస్ చేరికకు ముహార్తం కుదిరింది. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు.
కాంగ్రెస్ పార్టీ కోసం కరుడు కట్టిన కార్యకర్తగా పనిచేశా..ఇంకా ఎంతోమంది పనిచేస్తున్నారు. కానీ రేవంత్‌రెడ్డి టిక్కెట్లు అమ్మకుంటూ పార్టీని అమ్ముకునే కుట్ర చేస్తున్నారని ఉప్పల్ టిక్కెట్ ఆశించి భంగపడిన నేత సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచనల ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్లో శుక్రవారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్(BRS)లో చేరుతున్నట్లు సింగిరెడ్డి స్వయంగా ప్రకటించారు.
కాప్రా ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన సతీమణి ఏఎస్‌రావునగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషారెడ్డితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రెండోవిడత విడుదల తర్వాత రాష్ర్ట వ్యాప్తంగా రేవంత్‌రెడ్డి బాధిత సంఘం(RBI) సంఘానికి అండగా నిలుస్తునాని బాధితులు పక్షాన పోరాటం చేస్తున్నానని చెప్పారు. బాధితులు అంతా కలసి కొడంగల్‌లో రేవంత్ ఓటమి కోసం కలిసి అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు.
ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కోసం తాను పనిచేస్తానని పేర్కొన్నారు. ఉప్పల్ అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే బండారి లక్ష్మారెడ్డితోనే సాధ్యం అవుతుందన్నారు. తాను కార్యకర్తలు, ప్రజల కోసం తాను బీఆర్ఎస్ పార్టీలో సైతం అదే దూకుడుగా పనిచేస్తానని తెలిపారు.