Ts Elections: దీపావళికి ముందే పేలుతున్న నేతల మాటలు

మన ఈనాడు:

నోటిఫికేషన్ విడుదల నుంచి ఎన్నికల కోడ్​ ముగిసే వరకు సంక్షేమ పథకాలకు సంబంధించి నగదు బదిలీ ఆపేలా చర్యలు తీసుకోవాలని ఈసీకి కాంగ్రెస్ (Congress) పార్టీ వినతి పత్రం అందించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల నడుమ మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధానంగా రైతు బంధు పథకాన్ని (Rythu Bandhu Scheme) ఆపి రైతులను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని భారాస నేతలు (BRS Leaders) ఆరోపిస్తున్నారు. కాగా కాంగ్రెస్ నేతలు మాత్రం రైతు బంధు నిధులను ఇంకా ముందుగానే ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నామని అంటున్నారు. కేసీఆర్ (CM KCR) చెల్లింపులు చేయకపోతే.. నెల రోజుల్లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు కింద ఎకరాకు రూ.15 వేలు.. పింఛన్ రూ.4 వేలు ఇస్తామని రేవంత్​రెడ్డి ప్రకటించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సైతం ఈ అంశంపై స్పందించారు. చివరికి మంచి నీళ్లు, ఇరవై నాలుగు గంటల కరెంట్ కూడా ఆపెయ్యమంటారేమో? అని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిన ఈ పని ద్వారా ఆ పార్టీ అంటేనే… రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందని ధ్వజమెత్తారు. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయిందన్నారు.

Share post:

లేటెస్ట్