
కోలీవుడ్ నటుడు కార్తి (karthi) తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. అందులో ఇప్పటి వరకు చాలా చిత్రాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అందులో ఒకటి 2022లో వచ్చిన స్పై, యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ (Sardar)’ మూవీ. పి.ఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ కూడా రాబోతోంది. ‘సర్దార్ 2’ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.
ప్రోలాగ్ వీడియో
తాజాగా ఈ సినిమాలో విలన్‌ను పరిచయం చేస్తూ.. ప్రోలాగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. సర్దార్-2 (Sardar-2)లో ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య (SJ Surya) ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న వీడియో చూస్తే తెలుస్తోంది. 2 నిమిషాల 57 సెకండ్ల నిడివి గల సర్దార్ 2 ప్రోలాగ్ వీడియో యాక్షన్ సీన్‌తో ఓపెన్ అయింది. ‘ఇది నాతో ముగిసిపోదు సర్దార్.. నీ దేశానికి ఓ పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచదేశాల్లోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలన్నీ అతడి కోసం వెతుకుతున్నాయి. బ్లాక్ డాగర్ ఈజ్.. కమింగ్’ అంటూ ఎస్‌జే సూర్య పాత్రను పరిచయం చేసిన తీరు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
బ్లాక్ డాగర్ ఈజ్ కమింగ్
ఇక సర్దార్ 2లో కార్తీ సరసన మాళవిక మోహనన్ (Malavika Mohanan), అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తాజాగా ప్రోలాగ్ వీడియో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న కార్తీ సర్దార్-2 చిత్రం గురించి మాట్లాడుతూ హైప్ క్రియేట్ చేశారు. ‘సర్దార్’ విడుదలయ్యాక చాలా మంది వాటర్ బాటిల్స్ కొనుగోలు చేయడానికి భయపడ్డారని తెలిపారు. పార్ట్ 2 కాన్సెప్ట్ చూస్తే ప్రేక్షకులు తప్పక కంగారు పడతారని అన్నారు. పార్ట్ 2 ప్రేక్షకులను మరింత భయపెడుతుందని సినిమాపై అంచనాలను పెంచేశారు.