
బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan), టాలీవుడ్ భామ శ్రీలీల (Sreeleela) డేటింగ్ లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక శ్రీలీల కార్తీక్ ఫ్యామిలీ ఫంక్షన్ లో కనిపించడం, ఈ భామ డ్యాన్స్ చేస్తుంటే ఆ హీరో వీడియో తీయడం వంటి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో ఈ జంట రిలేషన్షిప్ లో ఉందంటూ వార్తలు మరింత చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఈ జంట డేటింగ్ రూమర్లపై హీరో కార్తీక్ ఆర్యన్ తల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
View this post on Instagram
ఆ కామెంట్స్ శ్రీలీల గురించేనా?
ఐఫా వేడుకల్లో కార్తీక్ ఆర్యన్ తో కలిసి పాల్గొన్న అతడి తల్లి (Kartik Aryan Mother) తనకు కాబోయే కోడలి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ ఇండైరెక్టుగా శ్రీలీలను తన కోడలిగా చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా ఉన్నాయని నెట్టింట న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఐఫా వేడుకల్లో (IIFA 2025) పాల్గొన్న కార్తీక్ తల్లిని.. ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) కాబోయే కోడలి గురించి ప్రశ్నించారు. ఎలాంటి కోడలు కావాలంటూ అడగ్గా.. ఓ మంచి డాక్టర్ తమ ఇంటికి కోడలిగా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
View this post on Instagram
వాళ్లంతా డాక్టర్లే
ఇప్పుకు కార్తీక్ ఆర్యన్ తల్లి చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. శ్రీలీల ఓవైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు ఎంబీబీఎస్ చదువుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ హీరో తల్లి శ్రీలీలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం.. కార్తీక్ ఆర్యన్ ఇంట్లో తల్లిదండ్రులు, అతడి సోదరి కూడా డాక్టర్. ఇళ్లంతా డాక్టర్లే కావడంతో కోడలు కూడా డాక్టర్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమె అలా అని ఉండొచ్చని అంటున్నారు. మొత్తానికి ఈ న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి.
View this post on Instagram
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…