SSMB29 సినిమాపై డిప్యూటీ సీఎం స్పెషల్ పోస్టు

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ (Mahesh Babu) బాబు కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగుకు సంబంధించి ఇటీవలే పలు వీడియోలు, ఫొటోలు లీక్ అయ్యాయి. మొదటి నుంచి ఈ సినిమాపై సస్పెన్స్ క్రియేట్ చేస్తూ.. సీక్రెసీ మెయింటైన్ చేస్తున్న జక్కన్న.. ఈ లీకుల వల్ల అలర్ట్ అయ్యాడు. ఇక నుంచి ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి లీకులు వైరల్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు.

SSMB29పై డిప్యూటీ సీఎం పోస్టు

అయితే ప్రస్తుతం SSMB29 మూవీ షూటింగు ఒడిశాలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి (AP Deputy CM) ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. SSMB29 చిత్ర షూటింగు తమ రాష్ట్రంలో జరగడం తమకు గర్వకారణమని ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా పోస్టులో పేర్కొన్నారు. ఇది స్థానికంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు తమ రాష్ట్రాన్ని సినిమా షూటింగులకు ఆకర్షణీయ కేంద్రంగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మా రాష్ట్ర పర్యటకానికి మేలు

“గతంలో మల్కాన్‌గిరిలో పుష్ప-2 (Pushpa 2 : The Rule) షూటింగ్ జరిగినట్లే.. ఇప్పుడు దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB29 షూటింగు ఒడిశాలోని కోరాపుట్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాలీవుడ్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) వంటి అగ్రనటులు కనిపించనున్నారు. వీరంతా మా రాష్ట్రంలో షూటింగ్ కోసం రావడంతో మా రాష్ట్ర ప్రఖ్యాతి మరింత పెరిగింది. రాజమౌళి సినిమా షూటింగు వల్ల ఒడిశాలో భవిష్యత్తులో సినిమా షూటింగ్ తో పాటు టూరిజానికి మంచి డిమాండ్ ఏర్పడుతుందని భావిస్తున్నాం. మా వద్ద షూటింగ్స్ చేసుకునేందుకు అన్ని భాషల ఇండస్ట్రీలను సాదరంగా స్వాగతిస్తున్నాం.” అంటూ డిప్యూటీ సీఎం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *