ఓటీటీలోకి ‘ముఫాసా : ది లయన్‌ కింగ్’

హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్ (Mufasa The Lion King)’ డిసెంబర్ 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ది లయన్ కింగ్ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఇండియాలోనే దాదాపు రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. చిన్న పిల్లలతోపాటు పెద్ద వాళ్లను కూడా ఈ సినిమా ఆకట్టుకుంది.

ఓటీటీలోకి ది లయన్ కింగ్

ఇక ఇప్పుడు దాదాపు మూడు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ‘ముఫాసా: ది లయన్‌ కింగ్’ (Mufasa The Lion King Ott News) ఓటీటీ అప్‌డేట్‌ని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో ఈ చిత్రం మార్చి 26వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ సినిమా తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, త‌మిళం భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతోంది.

ముఫాసాకు మహేశ్ డబ్బింగ్

ఇక ఈ సినిమా సంగతికి వస్తే  తెలుగులో ముఫాసా అనే రాజు పాత్ర‌కు మ‌హేశ్ బాబు (Mahesh Babu) డ‌బ్బింగ్ చెప్ప‌ారు. ఈ డబ్బింగ్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరోవైపు హిందీ వెర్ష‌న్‌కు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) డ‌బ్బింగ్ చెప్పాడు. ముఫాసా కొడుకు పాత్ర అయిన సింబా పాత్ర‌కు షారుఖ్ కొడుకు ఆర్య‌న్ ఖాన్ తన గాత్రం అందించాడు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *