–నరేష్ చిట్టూరి
ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా ఝలుపిస్తున్నారు. మరోవైపు మైనింగ్ శాఖ , పోలీస్, రెవెన్యూ ఉమ్మడిగా ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేస్తున్నారు.
రాజకీయ ఒత్తిడితో మళ్లీ దందా..?
ఒకవైపు అధికారులు అక్రమ ఇసుక రవాణా కట్టడి ప్రయత్నాలు చేస్తుంటే రాజకీయ ఒత్తిళ్లతో మళ్లీ దందా కొనసాగిస్తున్నారని ప్రజల బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. సర్కారు లక్ష్యానికి తూట్లు పడేలా కొందరు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు అక్రమ ఇసుక రవాణా వాహనాలు పట్టుబడటం సాక్ష్యంగా నిలుస్తుంది.