Mana Enadu: గత కొన్ని నెలలుగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ‘హైడ్రా(HYDRA)’ వణికిస్తోంది. అక్రమ కట్టడాలు, చెరువులు, నాళాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చడమే(Demolition of occupied structures) లక్ష్యంగా పనిచేస్తోంది. భావితరాలు బాగుండాలంటే రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాను అమలు చేయాలని కొన్ని వర్గాలు కోరుతుండగా మరోవైపు.. హైడ్రాపై విమర్శలు కూడా ఆ స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకురావాలని అక్కడి ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్(Congress Govt) తెచ్చిన హైడ్రా చర్చనీయాంశంగా మారింది. అయితే హైడ్రాను ఏర్పాటు చేసి నేటితో 100 రోజులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విటర్(X) వేదికగా విమర్శలు గుప్తించారు.
పరిరక్షణ పేరుతో కొత్త డ్రామాలు
కేటీఆర్ ట్వీట్(KTR’s tweet)లో ఏముందంటే.. ‘‘పేదల జీవితాలను రోడ్డుకీడ్చిన రేవంత్ సర్కార్!! వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్టుగా. హైదరాబాద్ మహానగర కబ్జాలను ప్రోత్సహించిన కాంగ్రెస్ కొత్తగా పరిరక్షణ పేరుతో డ్రామాలు ఆడుతోంది. ప్రజా పాలన అని పేదల జీవితాలను బజారుకీడ్చిన బరితెగింపు మీ ప్రజా ప్రభుత్వం నినాదానికి తిలోదకాలు ఇవ్వడం కాదా? కబ్జాలు చేసి.. కార్పొరేట్లకు ఊడిగం చేసి ఇళ్లు నిర్మించుకోలే.. రూపాయి..రూపాయి కూడబెట్టి శ్రమకోర్చి సొంతింటిని నిర్మించుకున్నరు.. నోటీసులు కూడా ఇవ్వకుండా కూలగొట్టేందుకు మనసెలా వచ్చింది ముఖ్యమంత్రి గారు?’’ అని కేటీఆర్ (X)లో ధ్వజమెత్తారు.
మీ పార్టీకి ఒక స్పష్టమైన విధానమంటూ ఉండదా?: KTR
‘పేదల నివాసాలు అక్రమ నిర్మాణాలైతే.. వాటికి అనుమతులు ఇచ్చిన అధికారుల అంతు చూడకుండా అన్యాయం.. అధర్మమంటే ఎరగని సామాన్య జనంపై ఈ బుల్డోజర్ దాడులు ఎవరి కోసం? మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో బుల్డోజర్ సర్కార్‌ను వ్యతిరేకిస్తడు. మీరేమో ఇక్కడ యథేచ్చగా బుల్డోజర్ విధానాల(Bulldozer procedures)ను కొనసాగిస్తున్నారు? మీ పార్టీకి ఒక స్పష్టమైన విధానమంటూ ఉండదా? ఇప్పటికీ చెప్తున్నాం.. హైడ్రా పేరుతో పేదలను నిరాశ్రాయులు చేస్తామంటే.. ఆ హైడ్రా బుల్డోజర్‌లకు అడ్డుపడతాం! వంద రోజుల్లో మీ హైడ్రా బుల్డోజర్ అనుముల తిరుపతి రెడ్డి ఇంటి ఒక్క ఇటుకను కూడా ఎందుకు ముట్టలేకపోయిందో చెప్పగలవా రేవంత్ రెడ్డీ?’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
హైడ్రా.. 100డేస్..
పేదల జీవితాలను రోడ్డుకీడ్చిన రేవంత్ సర్కార్!!వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్టుగా… హైదరాబాద్ మహానగర కబ్జాలను ప్రోత్సహించిన కాంగ్రెస్ కొత్తగా పరిరక్షణ పేరుతో డ్రామాలు!!
ప్రజా పాలన అని పేదల జీవితాలను బజారుకీడ్చిన బరితెగింపు మీ ప్రజా ప్రభుత్వం… pic.twitter.com/2iOybfxA32
— BRS Party (@BRSparty) October 25, 2024