చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడిపై దాడి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే

రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయం (chilkur balaji temple) గురించి తెలియని వారుండరు. ఈ ఆలయం ఎంత ఫేమస్సో ఈ ఆలయ  ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ కూడా అంతే పాపులర్. అయితే ఆయనపై ఇటీవల దాడి జరిగినట్లు తెలిసింది. ఫిబ్రవరి 7వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామరాజ్యం అనే ర్యాడికల్ సంస్థకు చెందిన 20 మంది రంగరాజన్ (chilkur balaji priest) పై దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు.

అందుకే రంగరాజన్ పై దాడి

రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కొంతమంది వ్యక్తులు రంగరాజన్ ను కోరగా.. అందుకు ఆయన నిరాకరించడంతో ఈ దాడికి తెగబడ్డారని ప్రధానార్చకుడి తండ్రి సౌందర్‌ రాజన్‌ తెలిపారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వాళ్లు దాడులు చేస్తారు.. వీళ్లు చూస్తారు

ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR Tweet Today) స్పందించారు. ” ధర్మరక్షకులపై దాడులు చేస్తారు…రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు” అంటూ ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నా .. హోం మంత్రి? ముఖ్యమంత్రి? ఏం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఘటనపై హిందూ ధర్మ పరిరక్షకులు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *