కుబేర ట్విట్టర్ రివ్యూల హైలెట్స్.. ధనుష్ యాక్టింగ్ కి ఫాన్స్ ఫిదా..

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ విడుదలైన శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం ‘కుబేరా’(Kubera) థియేటర్లలో విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా ధనుష్(Dhanush) నటనకు నెటిజన్లు తెగ ఫిదా అవుతూ ట్విట్టర్ లో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ధనుష్ ఈ సినిమాలో చేసిన బీగర్ పాత్రను నెటిజన్లు “కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్”గా అభివర్ణిస్తున్నారు. అసలు ధనుష్ ఈ పాత్ర ఒప్పుకోవడం చాలా గ్రేట్ అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అతని ఎమోషనల్ డెప్త్, డైలాగ్ డెలివరీ, మౌనంతో చెప్పిన భావోద్వేగాలు ప్రేక్షకుల మనసులను హత్తుకున్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అలాగే నాగార్జున నటనకూ మంచి మార్కులు వేస్తున్నారు. ధనుష్ – నాగార్జున(Nagarjuna) మధ్య స్క్రీన్‌ప్లేలో ఉన్న సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయని అంటున్నారు అభిమానులు. ఎమోషన్‌కు ప్రాధాన్యం ఇచ్చిన ఈ ఇద్దరి నటన సినిమాకు బలాన్ని చేకూర్చిందని అంటున్నారు.

సినిమాకు సంబంధించిన మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్(Devisri Prasad) అందించిన సంగీతం, ఎమోషన్స్ వంటి అంశాలు నెటిజన్ల ప్రశంసలు పొందుతున్నాయి. నికేత్ బొమ్మిరెడ్డి తీసిన విజువల్స్ సినిమాను ఒక క్లాసీ లుక్‌తో చూపించాయన్న ట్వీట్లు వెలువడుతున్నాయి. అయితే, కొందరు నెటిజన్లు సినిమా రెండో భాగం కొంచెం నెమ్మదిగా సాగిందని, క్లైమాక్స్ కాస్త తొందరగా ముగించారని పేర్కొన్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *