సంగీత ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకొంటున్న టాప్ 10 లేడీ సింగర్స్ వీళ్ళే..

సినీ సంగీత(singers) ప్రపంచంలో గాయనీమణులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తమ మధురమైన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను కట్టిపడేస్తూ, సంగీత ప్రియుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు. వారు పాడిన పాటలు ఇప్పటికి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. వీరు సినిమాల్లో పాటలు పాడడమే కాకుండా, లైవ్ కాన్సర్ట్లు, మ్యూజిక్ ఫెస్టివల్స్, ఈవెంట్‌ల ద్వారా కోట్లలో సంపాదిస్తూ, మేల్ సింగర్స్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నవారు చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ లేడీ ప్లేబ్యాక్ సింగర్స్ వీరే:

1. శ్రేయా ఘోషాల్(Sriya Goshal)

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన గాయనీగా నిలిచిన శ్రేయా ఘోషాల్‌ ఒక్కో పాటకు సుమారు రూ. 25–27 లక్షలు, లైవ్ కాన్సర్ట్‌కు రూ. 40–45 లక్షల వరకు ఛార్జ్ చేస్తారు.
ఆమె పాడిన పాటలు ‘బర్సో రే’, ‘దేవసేన’ (బాహుబలి 2) పాటలకు ఆమె అనేక జాతీయ అవార్డులు తీసుకుంది. ,’సూసేకీ’ (పుష్ప 2), ‘హైలోస్సో’ (తండేల్), ‘నానా హైరానా’ (గేమ్ ఛేంజర్) వంటి పాటలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.

2. సునిధి చౌహాన్(Sunidhi Chowhan)

చిన్నతనంలోనే సంగీత రంగంలో అడుగుపెట్టి బాలీవుడ్‌లో తనదైన గుర్తింపు సంపాదించిన సునిధి ఒక్కో పాటకు రూ. 20–25 లక్షలు, లైవ్ కాన్సర్ట్‌కు రూ. 25–30 లక్షలు తీసుకుంటారు.
‘ఢూమ్ మచాలే’, ‘బీడీ జలైలే’ వంటి పాటలతో బాలీవుడ్ ని షేక్ చేసాయి. ఇక తెలుగులో ‘సరదాగా చందమామనే’ (ఓయ్) సినిమాలోని పాట సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంది.

3. కనికా కపూర్(Kanika Kapur )

స్టైల్, గ్లామర్‌తో పాటు అద్భుతమైన వాయిస్ కలిగిన కనికా ఒక్కో పాటకు రూ. 18–22 లక్షలు తీసుకుంటుంది. ‘బేబీ డాల్’, ‘చిట్టియక్కలాయాన్’ ‘ఊ బోలేగా యా’ (పుష్ప) పాటలు ప్రేక్షకుల్ని ఉర్రుతలూగించింది.

4. నేహా కక్కర్

యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న నేహా కక్కర్ ఒక్కో పాటకు రూ. 10–15 లక్షలు, ఈవెంట్‌లకు రూ. 25–30 లక్షలు వసూలు చేస్తుంది. ‘మైల్ హో తుమ్’, ‘గర్మీ’ వంటి హిట్ పాటలు పాడింది.

5. అల్కా యాగ్నిక్

90వ దశకంలో బాలీవుడ్ హిట్‌ల రాణిగా పేరుగాంచిన అల్కా, ఇప్పటికీ పాటలతో ఆకట్టుకుంటున్నారు. ఒక్కో పాటకు రూ. 12 లక్షలు, కాన్సర్ట్‌కు రూ. 15–20 లక్షలు తీసుకుంటారు. ‘ఏక్ దో తీన్’ ‘చోలీ కే పీఛే’ ఈ పాటలు లక్షలాది మంది మనసులను గెలుచుకున్నాయి.

6. నీతి మోహన్

బాలీవుడ్‌లో గుర్తింపు పొందిన శ్రేష్ఠ గాయనీమణులలో ఒకరైన నీతి మోహన్, ఒక్కో పాటకు రూ. 8–10 లక్షలు తీసుకుంటుంది.

7. తులసి కుమార్

మెలోడీ సాంగ్స్‌తో శ్రోతల హృదయాలను గెలుచుకున్న తులసి కుమార్‌ ఒక్కో సినిమా పాటకు రూ. 5–10 లక్షలు, లైవ్ షోలకు రూ. 8–10 లక్షలు వసూలు చేస్తారు. తుమ్ జో ఆయే, లవ్ హో గయా వంటి పాటలతో అభిమానులను సంపాదించుకుంది. ఈ పాటలతో ఆమెకు దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

8. ఆషా భోస్లే

గాన గంగోత్రి లాంటి అనుభవజ్ఞులలో ప్రముఖురాలైన ఆషా భోస్లే, ఇప్పటికీ తన గాత్రం ద్వారా సంగీత ప్రియులను మెప్పిస్తున్నారు. ఒక్కో పాటకు ఆమె రూ. 5–8 లక్షలు, ఈవెంట్‌లకు రూ. 10–15 లక్షలు ఛార్జ్ చేస్తారు. దమ్ మారో దమ్, పియా తు అబ్ తో ఆజా ఈ పాటలు భారతీయ సంగీత చరిత్రలో నిలిచిపోయే క్లాసిక్స్‌గా నిలిచాయి.

9. శిల్పా రావు

తెలుగమ్మాయి అయిన శిల్పా రావు, తన గాత్ర శైలితో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన గాయనీమణి. ఒక్కో పాటకు ఆమె రూ. 5–10 లక్షలు పారితోషికంగా తీసుకుంటుంది.
ప్రస్తుతం ఆమె పాడిన ప్రముఖ తెలుగు పాటలు చుట్టమల్లే.. (దేవర), కావాలయ్యా.. (జైలర్)
ఈ పాటలతో ఆమెకు టాలీవుడ్‌లోనూ మంచి ఆదరణ లభిస్తోంది.

10. మోనాలీ ఠాకూర్

బహుముఖ ప్రతిభ కలిగిన మోనాలీ ఠాకూర్ సంగీత రంగంతో పాటు నటనలోనూ రాణిస్తోంది. ఒక్కో పాటకు రూ. 5–10 లక్షలు, లైవ్ షోలకు రూ. 15 లక్షల వరకు వసూలు చేస్తుంది. జరా జరా టచ్ మీ, సావర్‌లూన్ ఈ పాటల ద్వారా ఆమె యూత్ ఆడియెన్స్‌లో విపరీతమైన ఫేమ్ సంపాదించింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *