దిమ్మతిరిగే షాక్​ ఇచ్చిన బిగ్​బాస్.. ఏకంగా 12 మంది?

ManaEnadu : బిగ్​బాస్​ సీజన్​ 8(Bigg Boss Season 8)లో “ట్విస్ట్​లు, టర్న్​లు, ఫన్​.. ఎంటర్​టైన్​మెంట్​కి లిమిటే లేదు” అంటూ హోస్ట్​ నాగార్జున ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. కానీ షో స్టార్ట్ మూడు వారాలు దాటినా ఇప్పటికీ పెద్దగా చెప్పుకునే ట్విస్టులు ఏం ఇవ్వలేదు బిగ్ బాస్. ఇక ఇంతే ఈ షో అని ప్రేక్షకులు నిరాశ చెందుతున్న సమయంలో బిగ్ బాస్ అటు కంటెస్టెంట్లకు ఇటు ఆడియెన్స్ కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు. ఇంతకీ ఆ షాక్ ఏంటో లేటెస్ట్ ప్రోమో చూస్తే తెలిసిపోతోంది.

లేటెస్ట్ ప్రోమో(Bigg Boss Latest Promo)లో హౌస్ మేట్స్ అందరూ లివింగ్​ రూమ్​లోని సోఫాలో కూర్చున్నారు. ఆ సమయంలో బిగ్​బాస్​ ఓ పెద్ద భూకంపం రాబోతుందని చెబుతూ.. ‘మీ మనుగడను సవాల్ చేస్తూ.. మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్లొచ్చు’ అంటూ అందరినీ భయపెట్టాడు. అక్కడితో ఆగకుండా “ఇప్పటి వరకు బిగ్​బాస్​ చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. ఒకటి కాదు, రెండు కాదు.. ఐదు కాదు.. ఏకంగా 12 వైల్డ్​కార్డ్ ఎంట్రీ(Bigg Boss Wild Card Entries)లు మరో రెండు వారాల్లో రాబోతున్నాయి” అని ప్రకటించడంతో అటు కంటెస్టెంట్లతో పాటు ఇటు ఆడియెన్స్ కూడా ఫుల్ షాక్ అండ్ సర్ ప్రైజ్ అయ్యారు.

అయితే, ఈ సారి వైల్డ్​కార్డ్​ ఎంట్రీలను ఆపే పవర్​ అందరి​ హౌజ్​మేట్స్​కి ఇచ్చాడు బిగ్ బాస్. 12 ‘సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ (Survival Of Fittest Challenge)’ ఛాలెంజ్‌లను ఆడుతూ ఒక్కో ఛాలెంజ్ ను గెలిచిన ప్రతిసారి హౌస్ మేట్స్ ఒక వైల్డ్​ కార్డ్​ ఎంట్రీని ఆపొచ్చన్నమాట. ఒకవేళ ఓడిపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు. ఈ విషయం నాగార్జున చెప్పగానే హౌస్ మేట్స్ అంతా నోరెళ్లబెట్టి మరీ షాక్ అయ్యారు. అయితే 12 టాస్కులు అంటే హౌస్ మేట్స్ అన్నీ గెలవలేరని.. కనీసం ఓ ఆరు టాస్కుల్లో గెలిచి ఆరుగురిని నిలువరించినా.. మరో ఆరు వైల్డ్ కార్డు ఎంట్రీలు మాత్రం హౌసులోకి రావడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *