ManaEnadu : బిగ్‌బాస్ సీజన్ 8(Bigg Boss Season 8)లో “ట్విస్ట్‌లు, టర్న్‌లు, ఫన్.. ఎంటర్టైన్మెంట్కి లిమిటే లేదు” అంటూ హోస్ట్ నాగార్జున ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. కానీ షో స్టార్ట్ మూడు వారాలు దాటినా ఇప్పటికీ పెద్దగా చెప్పుకునే ట్విస్టులు ఏం ఇవ్వలేదు బిగ్ బాస్. ఇక ఇంతే ఈ షో అని ప్రేక్షకులు నిరాశ చెందుతున్న సమయంలో బిగ్ బాస్ అటు కంటెస్టెంట్లకు ఇటు ఆడియెన్స్ కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు. ఇంతకీ ఆ షాక్ ఏంటో లేటెస్ట్ ప్రోమో చూస్తే తెలిసిపోతోంది.
లేటెస్ట్ ప్రోమో(Bigg Boss Latest Promo)లో హౌస్ మేట్స్ అందరూ లివింగ్ రూమ్‌లోని సోఫాలో కూర్చున్నారు. ఆ సమయంలో బిగ్‌బాస్ ఓ పెద్ద భూకంపం రాబోతుందని చెబుతూ.. ‘మీ మనుగడను సవాల్ చేస్తూ.. మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్లొచ్చు’ అంటూ అందరినీ భయపెట్టాడు. అక్కడితో ఆగకుండా “ఇప్పటి వరకు బిగ్‌బాస్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. ఒకటి కాదు, రెండు కాదు.. ఐదు కాదు.. ఏకంగా 12 వైల్డ్‌కార్డ్ ఎంట్రీ(Bigg Boss Wild Card Entries)లు మరో రెండు వారాల్లో రాబోతున్నాయి” అని ప్రకటించడంతో అటు కంటెస్టెంట్లతో పాటు ఇటు ఆడియెన్స్ కూడా ఫుల్ షాక్ అండ్ సర్ ప్రైజ్ అయ్యారు.
అయితే, ఈ సారి వైల్డ్‌కార్డ్ ఎంట్రీలను ఆపే పవర్ అందరి హౌజ్‌మేట్స్‌కి ఇచ్చాడు బిగ్ బాస్. 12 ‘సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ (Survival Of Fittest Challenge)’ ఛాలెంజ్‌లను ఆడుతూ ఒక్కో ఛాలెంజ్ ను గెలిచిన ప్రతిసారి హౌస్ మేట్స్ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చన్నమాట. ఒకవేళ ఓడిపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు. ఈ విషయం నాగార్జున చెప్పగానే హౌస్ మేట్స్ అంతా నోరెళ్లబెట్టి మరీ షాక్ అయ్యారు. అయితే 12 టాస్కులు అంటే హౌస్ మేట్స్ అన్నీ గెలవలేరని.. కనీసం ఓ ఆరు టాస్కుల్లో గెలిచి ఆరుగురిని నిలువరించినా.. మరో ఆరు వైల్డ్ కార్డు ఎంట్రీలు మాత్రం హౌసులోకి రావడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు.