
తెలంగాణ(Telangana)లో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections)కు బ్రేక్ పడినట్లుగానే తెలుస్తోంది. రాష్ట్రంలో మరోసారి కులగణనకు(to the census) సీఎం రేవంత్ సర్కార్ అవకాశం కల్పించడంతో లోకల్ బాడీ ఎన్నికలకు బ్రేక్ పడినట్లుగానే కనిపిస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ఈ నెల 16 నుంచి 28 వరకు తమ వివరాలు నమోదు చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) సూచించారు. రాష్ట్రంలో 3.1 శాతం మంది ప్రజలు సర్వేలో వివరాలు ఇవ్వలేదని మంత్రి తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే వివరాలు ఇవ్వలేదని, KCR, KTR, పల్లా లాంటి వారు సర్వే(Survey)లో కావాలనే పాల్గొనలేదని భట్టి అన్నారు. అటు BCలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత తర్వాతే ఎన్నికలు జరగనున్నాయి.
బీసీ బిల్లుకు ఆమోదం పొందేలా ప్లాన్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశా(Parliament budget sessions)ల్లో బీసీ బిల్లుకు ఆమోదం పొందేలా సర్కార్ ప్యూహం రచిస్తోంది. కేంద్రాన్ని కూడా ఒప్పిస్తామని చెబుతోంది. బీసీ రిజర్వేషన్ల(BC Reservations) కోసం పంచాయతీల్లో కేంద్రం నిధులు ఆలస్యమైనా భరిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సీఎం రేవంత్ నేతృత్వంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తాం, KCRర్ వచ్చినా కలుపుకుని వెళ్తామన్నారు.
ఏప్రిల్ మూడో వారం లేదా మే చివరి వారంలో..
దీంతో ఏప్రిల్(April) మూడో వారం లేదా మే చివరి వారంలో గానీ స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మే(May)లో ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున ఏప్రిల్లోపే ముగించవచ్చని, లేదంటే మే చివరి వారంలో నిర్వహించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన మున్సిపాలిటీల్లోనూ స్పెషల్ఆఫీసర్ల పాలన(Rule of Special Officers) కొనసాగుతోంది. దీంతో రూరల్ లోకల్ బాడీస్ ఎన్నికలు పూర్తవగానే.. అర్బన్ లోకల్‌బాడీ ఎలక్షన్స్(Urban Local Body Elections) నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. ఏదిఏమైనా జూన్‌కల్లా పూర్తి చేయాలని ఈ ఎన్నికలు అన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.