Kaleswaram: కాళేశ్వరంలో ప్రారంభమైన కుంభాభిషేక మహోత్సవాలు

తెలంగాణ దక్షిణకాశీ అయిన కాళేశ్వరం(Kaleswaram)లో కొలువైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి(Sri Kaleswara Mukteshwara Swami) ఆలయంలో శతచండి మహారుద్ర సహస్ర ఘటాభిషేక కుంభాభిషేక మహోత్సవాలు(Kumbhabhisheka Mahostavalu) నేటి (ఫిబ్రవరి 7) నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు 42 ఏళ్ల తరువాత ఈ మహోత్సవాలు జరుగుతుండటం విశేషం. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కుంభాభిషేక మహోత్సవ ప్రారంభ వేడుకల నేపథ్యంలో ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణలతో కాలినడకన త్రివేణీ సంగమ గోదావరి(Triveni Sangam Godavari) నదికి చేరుకున్నారు. అక్కడ ఐదు కలశాలతో గోదావరి జలాలు సేకరించి కుంభాభిషేకానికి తీసుకువచ్చారు. ఆ తర్వాత గోపూజ, గణపతి పూజలతో మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు

అనంతరం అచ్చలాపురం రుత్వికులు(Ruthviks of Acchalapuram) ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ 1,108 కలశాలకు పూజలు చేశారు. మహోత్సవాల కారణంగా వచ్చే మూడు రోజుల పాటు ఆలయంలో ఆర్జిత సేవల(Arjitha Seva)ను అధికారులు రద్దు చేశారు. గర్భగుడి దర్శనాలను కూడా నిలిపివేశారు. ఈ మహోత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 9న ఉదయం 10:42 గంటలకు తుని పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి(Sachidananda Saraswati Swami) చేతుల మీదుగా మహాకుంభాభిషేకం జరగనుంది.

Related Posts

Heavy Rains: మూడు రోజులు భారీ వర్షాలు.. ఎవరూ బయటికి రావొద్దన్న హైడ్రా

హైదరాబాద్ నగరం(GHMC)లో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరించిన నేపథ్యంలో హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. 13, 14, 15 తేదీల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు…

Hyderabad Rains: భాగ్యనగరంలో దంచికొట్టిన వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్

గతవారం వరకూ ఎడతెరిపి లేని వర్షాలు(Rains) హైదరాబాద్(Hyderabad) వాసులను అతలాకుతలం చేశాయి. కనీసం బట్టలు ఆరబెట్టుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు వరుణుడు. అయితే ఎట్టకేలకు నాలుగు రోజులుగా ఎండలు కొడుతున్నాయి. కానీ నిన్న (ఆగస్టు 4) సాయంత్రం భారీ వర్షంతో మరోసారి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *