Mana Enadu : జ్ఞాపకాలు.. గతం తాలూకు అనుభవాలను మోసుకెళ్తూ భవిష్యత్తులో ముందుకు సాగేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే అంటారు ‘జ్ఞాపకాలు మంచివైనా.. చెడ్డవైనా మోయాల్సిందేనని’. చెడు జ్ఞాపకాల (Memories) సంగతేమో కానీ.. మంచి జ్ఞాపకాలు మాత్రం నెమరువేసుకున్నా కొద్దీ మనసుకు ఏదో తెలియని హాయి. ఇక ఆ అనుభూతులను కలిసి అనుభవించిన వారితో కలిసి ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే ఇంకెంత బాగుంటుంది.
అలాంటి సంఘటనకు వేదికైంది మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలోని ఆర్పీ కన్వెన్షన్ హాల్. ముప్పై ఏళ్ల క్రితం కలిసి పదో తరగతి చదువుకున్న విద్యార్థులంతా ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. 30 ఏళ్ల తర్వాత మళ్లీ తమ చిన్ననాటి స్నేహితుల(Friends)ను కలుసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్లాన్ వేశారు. వేదిక కన్ఫామ్ చేశారు. ఇంకేం.. అందరూ ఓ చోట కలిశారు. వారే అరవింద విద్యాలయానికి చెందిన 1994–95 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు.
జిల్లా కేంద్రంలోని ఆర్సీ కన్వెన్షన్ హల్లో ఆదివారం రోజున ఆత్మీయ సమ్మేళనం(Reunion) ఘనంగా జరుపుకున్నారు. అరవింద విద్యాలయం వ్యవస్థాపకులు ఎన్.చంద్రశేఖర్‌తోపాటు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. అనంతరం నాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఆనందంగా గడిపారు. నాలుగు పదుల వయస్సులో మళ్లీ పదో తరగతి (Tenth Class Students) పిల్లల్లా మారిపోయారు. ఆడిపాడి సరదాగా గడిపారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి మరికొన్ని జ్ఞాపకాలను క్రియేట్ చేసుకున్నారు.