UPI Transactions: బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ పేమెంట్స్.. ఎలా అంటే?

Mana Enadu: గూగుల్‌పే(GooglePay), ఫోన్‌పే(PhonePay) లాంటి UPI యాప్‌ల ద్వారా చెల్లింపులు జరపాలంటే మన బ్యాంకు ఖాతా(Bank Account)ను కచ్చితంగా జత చేయాలి. అయితే బ్యాంకు ఖాతా లేనివారు కూడా వేరొకరి ఖాతా నుంచి చెల్లింపులు జరిపే వీలు కల్పించేలా యూనిఫైడ్‌ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌(UPI) ప్లాట్‌ఫామ్‌పై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌(NPCI) కొత్త ఫీచర్‌‌ను పరిచయం చేసింది. డెలిగేట్‌ పేమెంట్స్‌గా పేర్కొనే UPI Circle ద్వారా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనికోసం ఓ ప్రైమరీ యూజర్ తన కాంటాక్టులో నచ్చిన నంబర్లను ఎంచుకోవచ్చు. ఇలా గరిష్ఠంగా ఐదుగురిని ఎంచుకునే వీలు ఉంటుంది. ఈ ఐదుగురిని సెకండరీ యూజర్లు అని పిలుస్తారు.

 రూ.15 వేల వరకు లావాదేవీలు జరపొచ్చు

అయితే సెకండరీ యూజర్ల(Secondary users)కు బ్యాంకు ఖాతా లేకపోయినా కూడా ప్రైమరీ యూజర్ ఖాతా నుంచి డబ్బు వాడుకోవచ్చు. నెలకు గరిష్ఠంగా రూ.15 వేల వరకు లావాదేవీలు జరపొచ్చు. అయితే సెకండరీ యూజర్ చెల్లింపులపై ప్రైమరీ యూజర్ పరిమితి విధించవచ్చు. అలాగే తన డబ్బు వాడుకోవాలంటే.. పర్మిషన్ అడిగేలా ఆప్షన్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. కొన్నేళ్ల క్రితం మనం బయటకి వెళ్లాల్సి వస్తే కచ్చితంగా డబ్బులు తీసుకువెళ్లాల్సి వచ్చేది. అప్పుడు చిల్లర సమస్య వేధించేది. అయితే UPI వచ్చాక ఈ సమస్యలన్నీ తీరిపోయాయి. ఈ విధానంలో అదనపు ఛార్జీలు(Additional charges) కూడా ఉండకపోవడంతో చాలా తక్కువ సమయంలోనే యూపీఐ ఎక్కువ ఆదరణ సొంతం చేసుకుంది.

 యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు – సర్వే

అయితే ఈ UPI చెల్లింపులకు ఛార్జీలు విధిస్తే దీని వినియోగం ఎలా ఉంటుంది? అనేదానిపై ఇటీవల లోకల్ సర్కిల్స్ ఓ సర్వే(Survey) నిర్వహించింది. 308 జిల్లాల నుంచి 42వేల మంది అభిప్రాయాలు సేకరించగా అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఒకవేళ యూపీఐకి ఛార్జీలు(Charges for UPI) విధిస్తే ఈ విధానాన్ని ఉపయోగించబోమని 75% ప్రజలు తేల్చి చెప్పారు. ఆర్థిక లావాదేవీలు చాలా సులువుగా జరుగుతున్నాయి కాబట్టి ఛార్జీలు వసూలు చేసినా తాము యూపీఐని వినియోగిస్తామని 22% మంది సానుకూలంగా స్పందించారు. ఇక 37-38% మంది వారి మొత్తం పేమెంట్లలో 50% పైగా యూపీఐ ట్రాన్సాక్షన్ల(UPI transactions) నుంచే ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

Related Posts

Gold & Silver Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు (Gold Rate) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ, జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. ఇండియా-అమెరికా మధ్య టారిఫ్‌ల ప్రభావం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్‌(Dollar) క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరల (Gold…

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. కేజీ వెండి రేటెంతంటే?

బంగారం ధరలు(Gold Rates) రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad Bullion Market)లో ఈ రోజు (ఆగస్టు 29) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,03,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *