చిరంజీవికి ‘యూకే లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి మరో అరుదైన గౌరవం దక్కింది. సినిమా రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గాను యూకే ప్రభుత్వం ‘లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు (UK Lifetime Achievement Award)’ను ప్రకటించింది. ఈ అవార్డును మార్చి 19వ తేదీన ఆ దేశ పార్లమెంటులో మెగాస్టార్ కు అందజేయనున్నారు.  ఈ పురస్కారంపై చిరు స్పందిస్తూ.. యూకే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు చిరుకు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

బ్యాక్ టు బ్యాక్ మూవీస్

ఇక చిరంజీవి సినిమాల సంగతికి వస్తే ప్రస్తుతం ఆయన బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న విశ్వంభర (Vishwambhara) చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో కోలీవుడ్ భామ త్రిష నటిస్తోంది. స్టాలిన్ తర్వాత ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ తర్వాత చిరు.. దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)తో కలిసి ఓ భారీ యాక్షన్ చిత్రం చేస్తున్నారు. ఇక దీని తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi)తోనూ  ఓ సినిమా ప్లాన్ చేశారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *