Mana Enadu : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు ముదురుతున్నాయి. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ (yahya sinwar)ను చంపిన నేపథ్యంలో ఇజ్రాయెల్ (Israel)పై ప్రతీకార దాడులకు లెబనాన్ సిద్ధమైంది. ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తామని లెబనాన్‌లోని హెజ్‌బొల్లా (Hezbollah) ఇటీవల హెచ్చరించింది. హెజ్‌బొల్లా వార్నింగ్‌తో IDF అప్రమత్తమైంది. హమాస్‌ను సమూలంగా నాశనం చేస్తామని వాగ్దానం చేసి అది పూర్తి చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్‌బొల్లా ఆర్థిక మూలాలను టార్గెట్ చేసింది.
ఈ క్రమంలోనే తాజాగా ఈ మిలిటెంట్ గ్రూప్‌నకు చెందిన ఓ సీక్రెట్ బంకర్ (Secret Bunker)ను గుర్తించింది. ఓ ఆసుపత్రి కింద ఉన్న ఈ రహస్య సొరంగం ఉన్నట్లు తెలిపింది. ఈ బంకర్‌లో భారీగా నోట్ల గుట్టలు, బంగారం ఉన్నట్లు చెప్పింది. హెజ్‌బొల్లా ఆర్థిక మూలాలపై వరుసగా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) అధికార ప్రతినిధి డేనియల్ హగారీ టెలివిజన్ తెలిపారు. ఆదివారం రాత్రి జరిపిన దాడుల్లో ఓ బంకర్‌ను ధ్వంసం చేయగా.. అందులో వేల డాలర్ల నగదు, బంగారాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఈ మిలిటెంట్ గ్రూప్‌నకు బీరుట్ నడిబొడ్డున అల్-సాహెల్ ఆసుపత్రి కింద ఉన్న మరో రహస్య బంకర్(Hezbollah Secret Bunker)లో వందల మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగారం గుట్టలు ఉన్నట్లు తెలిసిందని వెల్లడించారు.
“మాకున్న సమాచారం ప్రకారం.. ఆ బంకర్‌లో 500 బిలియన్ డాలర్ల నగదు (భారత కరెన్సీలో దాదాపు రూ.4,200కోట్లకు పైమాటే), బంగారం(Gold) గుట్టలు ఉన్నట్లు అంచనా వేస్తున్నాం. బంకర్ ఉన్న ఈ ప్రాంతంపై మేము దృష్టిపెట్టాం. అయితే, మా యుద్ధం హెజ్‌బొల్లాతో మాత్రమే. లెబనీస్ పౌరులతో కాదు. బంకర్ ఉన్న ప్రాంతంలోని ఆసుపత్రిపై మేము దాడి చేయబోం.” అని హగారీ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో సదరు ఆసుపత్రిని అధికారులు ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం.